Share News

Nightmares: పీడకలలను అధిగమించడం ఎలా..?

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:40 AM

ఒక్కోసారి నిద్రలో పీడకలలు వచ్చి కలవరపాటుని కలిగిస్తుంటాయి. వీటిని అధిగమించడానికి నిపుణులు ఇస్తున్న సూచనలు ఇవే...

Nightmares: పీడకలలను అధిగమించడం ఎలా..?

నిద్రకు ఉపక్రమించే ముందు మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కొద్దిసేపు ధ్యానం చేయడం, సంగీతం వినడం, పుస్తకం చదవడం లాంటివి ఉపకరిస్తాయి. భయానకమైన దృశ్యాలు ఉండే సినిమాలను పడుకునేముందు చూడకూడదు.

సాధ్యమైనంతవరకూ ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పీడ కలలు రావడం ఆగుతాయి.

ఆరోగ్యాన్ని అందించే పోషకాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరచుకోవాలి.

పీడకలలకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనికి యోగా చేయడం మంచి పరిష్కారం. పిల్లలతో కలిసి ఆటలాడడం, పార్కులో నడవడం, స్నేహితులతో కబుర్లు లాంటివి మనసుని ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

అనారోగ్య కారణాల వల్ల, వాడుతున్న మందుల వల్ల కూడా పీడకలలు రావచ్చు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ సమస్య తీరకపోతే మానసిక నిపుణుల సలహా పాటించాలి.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 04:40 AM