Summer Lunch Tips: వేసవిలో లంచ్ బాక్స్ సర్దేటప్పుడు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:32 AM
ఎండాకాలంలో లంచ్ బాక్స్ సర్దేటప్పుడు వేడి ఆహారాన్ని వెంటనే పెట్టకూడదు. చల్లార్చిన ఆహారాన్ని గాలి చొరబడని బాక్స్‌ల్లో వాడితే ఎక్కువసేపు తాజాగా ఉంటుంది

ఎండాకాలంలో ఆహారం తొందరగా పాడైపోతూ ఉంటుంది. పొద్దున్నే బాక్సులో పెట్టుకుని ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం మధ్యాహ్నం అయ్యేటప్పటికి తినడానికి వీలుగా ఉండదు. అందుకే ఉదయాన్నే లంచ్ బాక్స్‌లు సర్దేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆప్పుడే వండిన వేడివేడి ఆహారాన్ని వెంటనే బాక్సుల్లో సర్దేయకూడదు. అలా సర్దితే.... వేడి వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవుతాయి. కాబట్టి అన్నం, కూరలను చల్లార్చి విడివిడిగా బాక్సుల్లో సర్దాలి. అప్పుడే అవి చాలాసేపటి వరకూ తాజాగా ఉంటాయి.
టమాటా, దోసకాయ, ఆలుగడ్డలతో చేసిన కూరలు తొందరగా చేడిపోతూ ఉంటాయి. వీటికి బదులు పప్పు, పచ్చడి, పులుసు లాంటి వాటిని లంచ్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. అలాగే అన్నానికి బదులు చపాతీ, పుల్కా, శాండ్‌విచ్ పెట్టుకోవడం మంచిది.
పండ్లు ఎంత తాజాగా ఉన్నప్పటికీ వాటిని ముక్కలుగా కోసి బాక్సులో పెట్టుకుంటే మధ్యాహ్నానికే రుచి మారుతూ ఉంటాయి. పండ్లను ముక్కలుగా కోయకుండా వాటిని అలాగే బాక్సులో పెట్టుకుని తీసుకెళ్లడం మంచిది.
మామూలు స్టీల్ బాక్స్‌లు కాకుండా గాలి చొరబడని విధంగా గట్టి మూత ఉన్న బాక్స్‌లు వాడుకుంటే ఆహారం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
కొంతమంది రాత్రి వంటలను ఫ్రిజ్‌లో ఉంచి ఉదయాన్నే వాటిని బాక్సుల్లో సర్దుకుంటూ ఉంటారు. ఇలా రాత్రి వేళ ఆహారం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిల్వ ఉండదు. ముఖ్యంగా ఎండాకాలంలో..! అందుకే ఉదయం పూట తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే లంచ్ బాక్స్‌లో సర్దుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..