Share News

Rainy Season Trip Safety: వర్షాల్లో ట్రిప్‌కు వెళ్తున్నారా

ABN , Publish Date - Sep 04 , 2025 | 02:55 AM

వర్షాకాలంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు ఈ కాలంలో ట్రిప్‌లు ప్లాన్‌ చేసుకుంటారు. కానీ పలు జాగ్రత్తలు తీసుకోకపోతే పర్యాటక ప్రాంతాల్లో...

Rainy Season Trip Safety: వర్షాల్లో ట్రిప్‌కు వెళ్తున్నారా

వర్షాకాలంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారు ఈ కాలంలో ట్రిప్‌లు ప్లాన్‌ చేసుకుంటారు. కానీ పలు జాగ్రత్తలు తీసుకోకపోతే పర్యాటక ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవు. కాబట్టి వర్షాకాలం ట్రిప్‌ల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...

  • కొన్నిసార్లు అంచనాలను తారుమారు చేస్తూ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి గొడుగు, రెయిన్‌కోట్‌, వాటర్‌ప్రూఫ్‌ జాకెట్‌ వంటివి తీసుకెళ్లాలి. వాతావరణ పరిస్థితి ఎప్పటికి అప్పుడు తెలుసుకోవాలి.

  • ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటుంటాయి. వాటి వలన మలేరియా, డెంగ్యూ సోకే ప్రమాదముంటుంది. కాబట్టి దోమతెర, మస్కిటో రెపెల్లెంట్‌ వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

  • వాతావరణ మార్పుల వలన కొందరు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి అత్యవసర మందులతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ వెంట తీసుకెళ్లాలి.

  • వర్షాల కారణంగా నేల బురదగా ఉంటుంది. కాబట్టి చెప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. వాటర్‌ప్రూఫ్‌, గ్రిప్‌ ఉండే చెప్పులు, షూలు ఎంచుకోవాలి.

  • ఎక్కడికి వెళ్లినా వెంట నీళ్ల సీసా ఉంచుకోవడం మంచిది. అలాగే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడానికి ప్రయత్నించాలి. రోడ్డు పక్కన దొరకే ఆహారాన్ని తినకుండా ఉండేందుకు చూడాలి.

  • ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, కెమెరా వంటి ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్లు తడవకుండా వాటర్‌ఫ్రూప్‌ కవర్లు, బ్యాగులు తీసుకెళ్లాలి.

  • మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకునే వెసులుబాటు అన్నిచోట్లా ఉండదు. కాబట్టి పవర్‌ బ్యాంక్‌, అడాప్టర్‌ వంటివి వెంట ఉంచుకోవాలి.

  • గూగుల్‌ మ్యాప్‌ చాలావరకూ ఉపయోగకరంగా ఉంటుంది.. కానీ భారీ వర్షాల్లో గూగుల్‌ మ్యాప్‌ మీద ఆధారపడ కూడదు. కాబట్టి పర్యాటక ప్రాంతాల్లో తిరిగేందుకు స్థానిక రవాణాను ఉపయోగించుకోవడం మంచిది.

  • జలపాతాలు, సముద్రాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ లోతుకు వెళ్లకూడదు. ఈ కాలంలో కొండచరియలు విరిగి పడడం, బురద, తేమ వంటి సమస్యలుంటాయి కాబట్టి ట్రెక్కింగ్‌కు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్తే జలగలు, క్రిమికీటకాల నుంచి రక్షణ కోసం ఉప్పు, లైటర్‌ తీసుకెళ్లాలి.

  • పర్యాటక ప్రదేశాల్లో అన్నిచోట్లా సిగ్నళ్లు ఉండకపోవచ్చు. కార్డ్‌లు, యూపీఐ పేమెంట్‌లు చేసే వెలుసుబాటు ఉండకపోవచ్చు. కాబట్టి చేతిలో డబ్బులు ఉంచుకోవాలి.

  • ఎక్కడికి వెళ్లాలనుకున్నా ముందుగానే అక్కడ వసతి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

  • ఎంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉన్నా కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి ప్రయాణబీమా చేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 04 , 2025 | 02:55 AM