Mental Health Tips: ఒత్తిడిని చిత్తు చేయకపోతే
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:31 AM
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు అత్యంత సహజం. అయితే వీటికి విరుగుడుగా ఆశ్రయించే మార్గాలు సమస్యను పరిష్కరించేలా ఉండాలే తప్ప మరింత జటిలం చేసేలా ఉండకూడదు...
సైకాలజీ
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు అత్యంత సహజం. అయితే వీటికి విరుగుడుగా ఆశ్రయించే మార్గాలు సమస్యను పరిష్కరించేలా ఉండాలే తప్ప మరింత జటిలం చేసేలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఒత్తిడిని ప్రారంభంలోనే చిత్తు చేయాలే తప్ప ముదిరి మానసిక సమస్యలకు దారి తీసేవరకూ తాత్సారం చేయకూడదు అంటున్నారు మానసిక వైద్యులు గంజాయి అలవాటును ఇలా కనిపెట్టొచ్చు
కళ్లు ఎర్రబడతాయి
గంజాయి వాసన అంటిపెట్టుకుని ఉంటుంది
గంజాయి దొరకనప్పుడు కోపం, చికాకుకు లోనవుతూ ఉంటారు
గదులకే పరిమితమవుతూ ఉంటారు
కళ్లలోకి సూటిగా చూడలేకపోవడం
చదువులో, వృత్తిలో వెనకబడడం
పరీక్ష ముందు ఒత్తిడే లేకపోతే అందుకు తగ్గట్టు సిద్ధపడం. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఒత్తిడి అవసరమే! అయితే ఒత్తిడి మన సామర్థ్యాన్ని పెంచి ప్రయోజనాన్ని అందించేలా ఉండాలి. ఆందోళనకు దారి తీసి జీవితంలో వెనకపడేలా చేయకూడదు. అయితే ఒక్కోసారి ఒత్తిడి పెరగడం వల్ల నిద్రలేమి, భావోద్వేగాలు అదుపుతప్పడం, అలసట, ఒంటి నొప్పులు, పనిసామర్థ్యం తగ్గడం, అవసరానికి మించి కష్టపడవలసి రావడం లాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. ఒత్తిడి వల్ల వ్యాధినిరోధకశక్తి తగ్గి తేలికగా అస్వస్థతకు గురవుతూ ఉంటా రు. అయినప్పటికీ రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురవ్వదు. ఈ దశ దాటి ఆందోళన, మానసిక కుంగుబాటు సమస్యలు మొదలై, వృత్తిపర, వ్యక్తిగత సమస్యలు తలెత్తుతాయి. పనిలో నాణ్యత లోపించడంతో పాటు, కుటుంబంలో కీచులాటలు మొదలవుతాయి. గుండెదడ, చమటలు పట్టడం, తీవ్రమైన ప్యానిక్ అటాక్స్ లక్షణాలు కనిపిస్తాయి. అసిడిటీ, అధిక రక్తపోటు, అధిక మధుమేహం సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితి జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడికి లోనవుతున్నట్టు గుర్తించిన వెంటనే దాన్ని వదిలించుకునే ఆరోగ్యకరమైన మార్గాల కోసం అన్వేషించాలి.
ఒత్తిడి ఇలా దూరం
ఒత్తిడికి మూల కారణంతో వ్యవహరించే విధానం మీదే ఒత్తిడి ప్రభావం ఆధారపడుతుంది. ఒత్తిడిని అంగీకరించడం, మార్చుకోవడం, తప్పించుకోవడం... ఈ మూడు సూత్రాలను ఎవరికి తగ్గట్టు వారు అనుసరించాలి. తప్పించుకోగలిగే ఒత్తిడిలు కొన్ని ఉంటాయి. మార్చుకునే వీలుండేవి కొన్ని ఉంటాయి. కానీ అంగీకరించి తదనుగుణంగా నడుచుకోవడం మినహా మరేమీ చేయలేని ఒత్తిడిలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామాలతో ఒత్తిడిని వదిలించునే ప్రయత్నాలు చేయాలి. పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం, ఆప్తులతో బాధలు పంచుకోవడం, అభిరుచులకు సమయం కేటాయించడం, నచ్చిన పనులు చేయడం ద్వారా కూడా ఒత్తిడిని వదిలించుకోవచ్చు. అలాగే పరిస్థితులను మన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నియంత్రణలో లేని వాటిని అంగీకరించి ఒత్తిడికి లోనవకుండా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.
చికిత్స తప్పనిసరి
ఒత్తిడి, యాంగ్జయిటీ డిజార్డర్‌గా మారినప్పుడు తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. విపరీతమైన ఒత్తిడితో మెదడులో న్యూరోట్రాన్స్ మీటర్ల పనితీరులో కూడా హెచ్చుతగ్గులు చోటు చేసు కుంటాయి. కాబట్టి మందులతో మొదట ఆ హెచ్చుతగ్గులను సరిదిద్దుకుని, ఒత్తిడితో వ్యవహరించగలిగే మెలకువలు అలవరుచుకోవాలి.
గాడి తప్పే మార్గాలు
కొందరు ఒత్తిడిని వదిలించుకోవడం కోసం దురలవాట్లకు దగ్గరవుతారు. మద్యం, ధూమపానం, గంజాయిలతో ఒత్తిడిని వదిలంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఆ మార్గాన్ని ఆహారంలో వెతుక్కుని ఈటింగ్ డిజార్టర్‌కు లోనవుతారు. ధూమపానం, మద్యపానం, గంజాయి విషయానికొస్తే, ఎలాంటి దురలవాట్లలో అయినా ఫిజికల్ డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్ అనే రెండు సమస్యలుంటాయి. మద్యం, ధూమపానం మానుకున్నప్పుడు, వణుకు, నిద్రలేమి, చమటలు పట్టడం లాంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. కానీ గంజాయిలో మానసిక లక్షణాలు మినహా ఎలాంటి భౌతిక లక్షణాలూ కనిపించవు కాబట్టి ఈ అలవాటు సురక్షితమైనదనే ప్రచారం సాగుతోంది. కానీ నిజానికి గంజాయిలో సైకలాజికల్ డిపెండెన్స్ ఎక్కువ. చికాకు, కోపం, దుందుడుకుతనం, గంజాయి తీసుకోవాలనే బలమైన కోరికకు లోనవడం, అందుకోసం ఎంతకైనా తెగించడం లాంటి తీవ్రమైన మానసిక లక్షణాలుంటాయి. దాని కోసం నేరాలకు కూడా పాల్పడతారు. ఎదుటివారి మీద దాడులకు తెగబడడానికి, హాని కలిగించడానికి కూడా వెనకాడరు. మద్యపానం, ధూమపానం మానేసినప్పుడు తలెత్తే భౌతిక లక్షణాలను చికిత్సతో సరిచేసే వీలుంది. కానీ గంజాయి సంబంధిత మానసిక లక్షణాలకు చికిత్స సంక్లిష్టమవుతుంది. అలాగే కొందరు దుర్బలుల్లో గంజాయి అలవాటు, జన్యుపరమైన మార్పులకు దారి తీసి, స్కిజోఫ్రేనియా అనే ప్రధాన మానసిక సమస్యకు లోను చేస్తుంది. ఈ అలవాటును వదిలించడం కోసం మోటివేషన్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ థెరపీలో భాగంగా కౌన్సెలింగ్ సెషన్స్, డిఅడిక్షన్ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్ సుధారాణి
ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఒడి,
గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్,
ఎర్రగడ్డ, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News