Share News

Effective Treatment for Psoriasis: సోరియాసిస్‌కు సమర్థమైన వైద్యం

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:21 AM

తిరగబెడుతూ వేధించే చర్మ వ్యాధుల్లో సోరియాసిస్‌ ఒకటి. అయితే శరీర తత్వం, ప్రేరేపించే అంశాలు, మందుల ప్రభావాల ఆధారంగా చికిత్సను ఎంచుకోగలిగితే...

Effective Treatment for Psoriasis: సోరియాసిస్‌కు సమర్థమైన వైద్యం

హోమియో

తిరగబెడుతూ వేధించే చర్మ వ్యాధుల్లో సోరియాసిస్‌ ఒకటి. అయితే శరీర తత్వం, ప్రేరేపించే అంశాలు, మందుల ప్రభావాల ఆధారంగా చికిత్సను ఎంచుకోగలిగితే, ఈ మొండి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం!

సోరియాసి్‌సకు ఫలానా కారణమని కచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల, రక్షణ వ్యవస్థ శరీరం మీదే దాడి చేసే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ ఫలితంగా సోరియాసిస్‌ తలెత్తవచ్చు. వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. అయితే ప్రధానంగా మానసిక ఆందోళన, ఒత్తిడితో కూడిన జీవితం, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల సోరియాసిస్‌ తలెత్తవచ్చని కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. కొన్ని సందర్భాల్లో చర్మ గాయాలు మానిన తర్వాత, ఆ ప్రదేశంలో సోరియాసిస్‌ తలెత్తుతూ ఉంటుంది. దీన్ని ‘కోబ్నర్‌ ఫెనొమినా’ అంటారు. అలాగే కొన్ని రకాల మందులు, స్టిరాయిడ్స్‌ కూడా సోరియాసి్‌సను ప్రేరేపిస్తాయి.


ప్రధాన లక్షణాలు ఇవే!

  • దురద

  • చర్మంపై పగుళ్లు, పొట్టు ఏర్పడడం

  • పొట్టులా ఏర్పడిన ప్రదేశం చుట్టూరా మంట

  • గోకినప్పుడు పొట్టు రాలడం రకాలున్నాయి సోరియాసి్‌సలో ఐదు రకాలున్నాయి.

అవేంటంటే...

ఫ్లేక్‌ సోరియాసిస్‌: 80ు సోరియాసి్‌సలు ఈ కోవకు చెందినవే! ఈ సమస్య పెద్దల్లో ఎక్కువ.

గుట్టేట్‌ సోరియాసిస్‌: పిల్లలు, యుక్తవయస్కుల్లో తలెత్తుతుంది.

ఇన్వర్స్‌ సోరియాసిస్‌: స్థూలకాయుల్లో, చర్మపు ముడతల్లో వస్తుంది.

పస్ట్యులార్‌ సోరియాసిస్‌: అరుదుగా పెద్దల్లో వస్తుంది.

ఎరిత్రోడెర్మిక్‌ సోరియాసిస్‌: 90ు చర్మం సోరియాసి్‌సకు గురైనప్పుడు ఎరిత్రోడెర్మిక్‌ సోరియాసి్‌సగా పరిగణించాలి.

శాశ్వత చికిత్స లేదు

సోరియాసిస్‌ చికిత్సతో అదుపులోకొచ్చి, పూర్తిగా నయమైపోయిన భ్రమను కలిగిస్తుంది. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కనుమరుగైపోయే ఈ సమస్య, అకస్మాత్తుగా తిరబెడుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసి్‌సకు శాశ్వత చికిత్స లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అయితే ఈ వ్యాధిని అదుపులో పెట్టగలిగే సమర్థమైన చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. లక్షణాలు, శరీరంలో సోరియాసిస్‌ తలెత్తిన ప్రదేశం, మందులకు స్పందించే శరీర తత్వం, సమస్యను ప్రేరేపించే కారకాల ఆధారంగా చికిత్సను ఎంచుకోగలిగితే, ఈ చర్మ సమస్యకు వీలైనంతవరకూ అడ్డుకట్ట వేయవచ్చు. మరీ ముఖ్యంగా హోమియోపతిలో సోరియాసి్‌సకు రెండు రకాల చికిత్సలను అనుసరిస్తారు. చర్మపు దురద ఏ ఏ సందర్భాల్లో తలెత్తుతోంది, ఎప్పుడు పెరుగుతోంది? అనే అంశాల ఆఽధారంగా అందించే చికిత్స ఒకటైతే, సోరియాసిస్‌ ప్యాచె్‌సతో పాటు శరీర ఉష్ణోగ్రత, ఆహారపుటలవాట్లు, శరీరం మీద వాతావరణ ప్రభావాలు, మానసిక లక్షణాల ఆధారంగా అందించే చికిత్స రెండవది.


నివారణ ఇలా...

పొట్ట, ఛాతీ, తల, గోళ్లు, వేళ్ల మధ్య, పిరుదుల మధ్య, తొడల మధ్య మొట్టమొదటిగా సోరియాసిస్‌ తలెత్తుతుంది. వీటిలో ఏ ఒక్క శరీర భాగంలో సోరియాసిస్‌ తలెత్తినా, తలలో కూడా తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధిని నివారించుకునే సమర్థమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలర్జీ కారక ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, సమతులాహారం తీసుకోవడం, శుద్ధి చేసిన పదార్థాలు, పాలు, పాల ఉత్పత్తులు, శీతల పానీయాలకు దూరంగా ఉండడం అవసరం. అలాగే తేలికగా అరిగే ఆహారం తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఈ నియమాలు పాటించగలిగితే ఉన్న సోరియాసిస్‌ అదుపులో ఉండడంతో పాటు కొత్తగా సోరియాసిస్‌ తలెత్తకుండా ఉంటుంది.

డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ రావు గన్నం రాజు

నిత్య హోమియోపతి,

కుత్బీగూడ (కాచిగూడ), హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి

పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..

దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే

Updated Date - Sep 30 , 2025 | 03:21 AM