Share News

Cleaning Tips: పిల్లల షూ క్లీనింగ్‌ ఇలా...

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:56 AM

పిల్లలు పాఠశాలకు వెళ్లేటప్పుడు వేసుకునే షూలను కనీసం రెండు రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయంలో షూలను ఎలా క్లీన్‌ చేయాలో తెలుసుకుందాం!

Cleaning Tips: పిల్లల షూ క్లీనింగ్‌ ఇలా...

షూలను ముందుగా పాత టూత్‌బ్రష్‌తో రుద్దుతూ వాటికి అంటిన మట్టిని తొలగించాలి. లోపల ఉండే సోల్‌ని తీసి షూని బాగా దులపాలి.

డిటర్జెంట్‌, సర్ఫ్‌, షాంపూ కలిపిన నీళ్లలో పలుచని గుడ్డని ముంచి పిండాలి. దీనితో షూ లోపల, బయటా తుడవాలి. ఒక ట్రేలో ఈ నీళ్లు కొన్ని పోసి అందులో షూ అడుగు భాగం మునిగేలా ఉంచాలి. అయిదు నిమిషాల తరవాత మంచినీళ్లతో కడగాలి.

టూత్‌ బ్రష్‌ను కొద్దిగా సర్ఫ్‌ లేదా షాంపూలో ముంచి దానితో తెలుపు రంగు షూల పై భాగాన్ని రుద్దాలి. మురికి మొత్తం వదిలాక కొన్ని నీళ్లు చిలకరిస్తూ పలుచని గడ్డతో తుడవాలి.

షూలను శుభ్రం చేసిన తరవాత వాటి లోపల కాగితం ఉండలను లేదా పలుచని తువాలును గుండ్రంగా మడిచి ఉంచాలి. లోపలి భాగంలోని తడిని ఇవి పీల్చుకుంటాయి. అయిదు నిమిషాల తరవాత వీటిని తీసివేసి షూలకు బాగా గాలి తగిలేలా ఉంచి ఆరనివ్వాలి.


షూ లేసులను, సోల్‌ని సబ్బునీటిలో ముంచి పది నిముషాలు నాననివ్వాలి. తరవాత మంచి నీళ్లలో ముంచి తీసి గాలికి ఆరబెట్టాలి.

నైలాన్‌, కాటన్‌, పాలిస్టర్‌ పదార్థాలతో తయారైన కాన్వాస్‌ షూలను ముందుగా పైపైన శుభ్రం చేసి తరవాత పాత తువాలులో చుట్టి వాషింగ్‌ మెషిన్‌లో వేయవచ్చు.

లెదర్‌, రబ్బర్‌, వినైల్‌ షూలను మాత్రం చేతితో క్లీన్‌ చేసుకోవాలి.

షూలను శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. బ్లీచ్‌, ఫాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌లను వాడకూడదు.

ప్రతిరోజూ పలుచని పొడి గుడ్డతో పైపైన తుడిచి పాలిష్‌ చేసుకుంటూ ఉంటే షూలు కొత్తవాటిలా మెరుస్తాయి.


ఇవి కూాడా చదవండి..

Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2025 | 05:56 AM