Tips to Make Sofa Cover Clean: సోఫా కవర్ కొత్తగా
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:50 AM
కాలక్రమేణా సోఫా కవర్ మీద దుమ్ము, ధూళి చేరుతూ ఉంటాయి. రకరకాల మరకలు పడుతుంటాయి. తరచూ సోఫా కవర్‌ను ఉతకడం...
కాలక్రమేణా సోఫా కవర్ మీద దుమ్ము, ధూళి చేరుతూ ఉంటాయి. రకరకాల మరకలు పడుతుంటాయి. తరచూ సోఫా కవర్‌ను ఉతకడం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు చిన్న చిట్కాలు పాటించి సోఫా కవర్‌ను కొత్తగా మెరిసేలా చేయవచ్చు. ఆ వివరాలు...
సోఫా కవర్‌పై టీ, కాఫీ, జ్యూస్ మరకలు పడితే ముందుగా వాటిని పొడిగుడ్డతో తుడవాలి. చిన్న గిన్నెలో ఒక చెంచా లిక్విడ్ డిటర్జెంట్ లేదా డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి కొన్ని నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పలుచని గుడ్డను ముంచి దానితో మరకల మీద మెల్లగా తుడవాలి. తరువాత తడిగుడ్డతో అద్దితే మరకలు పూర్తిగా పోతాయి.
జిడ్డు, నూనె, మేకప్ మరకలు ఏర్పడితే వాటిమీద కార్న్‌ఫ్లోర్, ఫేస్ పౌడర్, బేకింగ్ సోడాలలో ఒకదాన్ని కొద్దిగా చల్లాలి. ఇరవై నిమిషాల తరువాత పాత టూత్‌బ్ర్‌షతో రుద్దితే మరకలు తొలగిపోతాయి.
సోఫా కవర్ మీద ఏవైనా మొండి మరకలు ఏర్పడితే... చిన్న దూది ఉండ మీద రెండు చుక్కల శానిటైజర్ లేదా ఆల్కహాల్ వేసి దానితో రుద్దితే చాలు. మరకలు మాయమవుతాయి.
వెడల్పాటి గిన్నెలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా షాంపూ వేసి బాగా కలపాలి. చేతి రుమాలును గుండ్రంగా మడిచి ఆ మిశ్రమంలో ముంచాలి. దానితో సోఫా కవర్‌ను తుడవాలి. తరువాత ఫ్యాన్ వేసి గాలికి ఆరనివ్వాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మరకలన్నీ పోయి సోఫా కవర్ కొత్తగా కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News