Share News

మృదువైన చేతుల కోసం

ABN , Publish Date - Jun 09 , 2025 | 06:15 AM

గిన్నెలు రుద్దడం, రసాయనాలు ఉంటే సబ్బులు వాడడం వలన చేతులు పొడిబారిపోయి, గరుకుగా ఉంటాయి. కాబట్టి హస్తాలు మృదువుగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

మృదువైన చేతుల కోసం

గిన్నెలు రుద్దడం, రసాయనాలు ఉంటే సబ్బులు వాడడం వలన చేతులు పొడిబారిపోయి, గరుకుగా ఉంటాయి. కాబట్టి హస్తాలు మృదువుగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

  • పెరుగు మీద మీగడను తీసుకుని చేతులకి రాసి మసాజ్‌ చేయాలి. ఇలా తరచూ చేయడం వలన చేతులు మృదువుగా మారతాయి.

  • ఒక చెంచా ఆలివ్‌ నూనెలో, చెంచా నిమ్మరసం, చెంచా గ్లిజరిన్‌, చెంచా పాలు, రెండు చెంచాల గోధుమ రవ్వ వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

  • కలబంద గుజ్జును రోజూ చేతులకు రాసుకుని ఓ పావుగంట తర్వాత కడిగేసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.

  • చెంచా దానిమ్మ రసంలో రెండు చెంచాల పంచదార కలిపి చేతులకు రాసి రుద్దాలి. దీని వల్ల చేతులపై ఉన్న మృత కణాలు తొలగిపోయి చేతులు మృదువుగా మారతాయి.

  • రోజూ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్‌ను లేదా తేనెను చేతులకు రాసినా హస్తాలు మృదువుగా మారతాయి.

  • టేబుల్‌స్పూన్‌ ఓట్స్‌లో అరటేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె వేసి కలిసి చేతులకు రాసి మర్ధన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఇవీ చదవండి:

దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 06:15 AM