Share News

Curry Leaves Benefits: కరివేపాకే కదా అని తీసి పారేయద్దు..!

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:18 AM

చాలామంది భోజనం చేసే సమయంలో కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు..

Curry Leaves Benefits: కరివేపాకే కదా అని తీసి పారేయద్దు..!

చాలామంది భోజనం చేసే సమయంలో కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు. దీనిని కేవలం సువాసన కోసం వాడతారనే భ్రమలో ఉంటారు. కానీ మన ప్రాచీన గ్రంథాలలో కరివేపాకును విశిష్టమైన ఔషధ గుణాలున్న మొక్కగా గుర్తించారు. దీనికి సంస్కృతంలో- ‘సుగంధి కైడర్య పత్రం’ అనే పేరు కూడా ఉంది. కరివేపాకులకు ఇటాలియన్‌, ఇండోనేషియన్‌, జర్మన్‌, ఫ్రెంచి పేర్లలో ’కరి‘ అనే పదం ఉంది. ఇంగ్లీషువారు వీటిని ‘కర్రీలీవ్స్‌’ (కూరాకులు) అని పిలిచేవారు. దాని నుంచే కరివేపాకు అనే పదం పుట్టింది. ఈ ఆకులకు ఉన్న ప్రత్యేక గుణాలను మన పురాతన గ్రంథాల్లో వివరించారు.

  • ఈ ఆకులకు విషాన్ని హరించే శక్తి ఉంది. వీటిని పచ్చిగా కానీ, ఎండబెట్టి కానీ వాడవచ్చు.

  • కరివేపాకులో ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ ఏ, కాల్షియం, ఐరన్‌, ప్రోటీన్లు ఉన్నాయి. ఈ కోణం నుంచి చూస్తే- ఇది పోషకాల విషయంలో ఇతర ఆకుకూరలతో పోటీ పడి గెలుస్తుంది.

  • క్రమం తప్పకుండా కరివేపాకును తింటే చర్మం నిగనిగలాడుతుంది.

  • కంటి సమస్యలకు కరివేపాకు పరిష్కారంగా పనిచేస్తుంది.

  • మన శరీరంలోని కఫ పైత్యాలను తగ్గిస్తుంది.

  • కడుపులోని నులిపురుగులను కరివేపాకు చంపేస్తుంది. ఎలా వాడాలి?

  • కరివేపాకుల్ని కడిగి శుభ్రం చేయాలి. వీటిని మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసంతో చారు కాచి తింటే నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు వెంటనే తగ్గుతాయి.

  • కరివేపాకు రసాన్ని ఒక పొంగు వచ్చేలా కాచి నిమ్మరసం కలుపుకొని తాగితే తల తిరుగుడు, పైత్యం, నోట్లో నీళ్లు ఊరటం, వికారం, త్రేన్పులు, గ్యాసు తగ్గుతాయి.

  • ఒక గ్లాసు పెరుగులో మూడు గ్లాసుల నీళ్లను కలిపి ఒక రాత్రి బయట ఉంచాలి. ఉదయాన్నే అందులో రెండు చెంచాల కరివేపాకు ముద్దను, పావు చెంచా మిరియాల పొడిని కలిపాలి. ఈ ద్రవం జీర్ణకోశ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇది మంచి ఔషధం.

  • కరివేపాకులను బాగా కడిగి నీడలో ఆరబెట్టాలి. వాటికి ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, మిరపకాయలు, చింతపండు తగు పాళ్లలో కలిపి మూకుడులో వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడి చేయాలి. ఈ ఆకులతోపాటు మునగాకులు కూడా కలిపితే మంచిది.

  • గంగరాజు అరుణాదేవి


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 12:18 AM