Share News

శరీరంలో కరిగిపోయే పేస్‌ మేకర్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:50 AM

బియ్యపు గింజ పరిమాణంలో రూపొందించిన పేస్‌ మేకర్‌, శస్త్రచికిత్స తదనంతర గుండెకు రక్షణనివ్వబోతోంది. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సూక్ష్మంగా ఉండే, శరీరంలో పూర్తిగా కరిగిపోయే వీలుండే...

శరీరంలో కరిగిపోయే పేస్‌ మేకర్‌

పురోగతి

బియ్యపు గింజ పరిమాణంలో రూపొందించిన పేస్‌ మేకర్‌, శస్త్రచికిత్స తదనంతర గుండెకు రక్షణనివ్వబోతోంది. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు సూక్ష్మంగా ఉండే, శరీరంలో పూర్తిగా కరిగిపోయే వీలుండే పేస్‌మేకర్‌ను రూపొందించారు. ఎలాంటి తీగలు, బ్యాటరీలు లేదా సర్జరీ అవసరం లేని ఈ పేస్‌ మేకర్‌, సహజసిద్ధంగానే శరీరంలో కలిసిపోతుంది. 1.8 మిల్లీమీటర్ల వెడల్పు, 3.5 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ పరికరాన్ని నేరుగా గుండెలోకి ఇంజెక్ట్‌ చేయవచ్చు. ఆ తర్వాత గాల్వానిక్‌ సెల్‌ మెకానిజం ద్వారా శరీర ద్రవాలనే ఇంధనంగా మలుచుకుని ఈ పరికరం పని చేయడం మొదలుపెడుతుంది. తీగల్లో ప్రవహించే విద్యుత్తుకు బదులుగా, చర్మం మీద అంటించుకున్న ప్యాచ్‌ ద్వారా ఈ పేస్‌ మేకర్‌ పని చేస్తుంది.


ఈ సూక్ష్మ పరికరం, గుండె అస్తవ్యస్థ లయలను పసిగట్టి, అతినీలలోహిత వెలుగుల ఆధారంగా గుండెను పని చేయిస్తూ ఉంటుంది. ఇలా గుండె దగ్గరకు ప్రవేశపెట్టిన ఈ పేస్‌ మేకర్‌ ఐదు నుంచి పది వారాల వ్యవధిలో తన విధిని పూర్తి చేసుకుని, సురక్షితంగా శరీరంలో కలిసిపోతుంది. పుట్టుకతోనే గుండె జబ్బులను వెంటబెట్టుకొచ్చిన పసికందులు, తాత్కాలిక పేసింగ్‌ అవసరమైన గుండె సర్జరీ రోగులకు ఈ సూక్ష్మ పేస్‌ మేకర్‌ ఒక ఆశాదీపం కాబోతోంది.


ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 07:51 AM