Blend of Tradition and Modern Fashion: జందానీ జబర్దస్త్
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:05 AM
ప్రతి పండుగకూ పట్టుచీరేనా? ఇంకేదైనా వెరైటీ చీర కట్టుకుందామా? అని ఆలోచించే మహిళలు నిస్సందేహంగా జందానీ చీరను ఎంచుకోవచ్చు. ఆకట్టుకునే రంగుల్లో, సౌకర్యవంతంగా ఉండే జందానీ సొగసులు ఇవే!
ఫ్యాషన్
ప్రతి పండుగకూ పట్టుచీరేనా? ఇంకేదైనా వెరైటీ చీర కట్టుకుందామా? అని ఆలోచించే మహిళలు నిస్సందేహంగా జందానీ చీరను ఎంచుకోవచ్చు. ఆకట్టుకునే రంగుల్లో, సౌకర్యవంతంగా ఉండే జందానీ సొగసులు ఇవే!
జందానీ అసలు పేరు ‘ఢకాయి’. ఢాకా నగరం నుంచే ఈ పేరొచ్చింది. ఈ అద్భుతమైన చీరలు ఢకాయి జందానీ లేదా ఢకాయి అనే పేరుతో ప్రజాదరణ పొందాయి. జమ్దాని అనే పదం మూలాలు పర్షియాలో ఉన్నాయి. బెంగాలీ చేనేత కళాకారులు జందానీ నేత పనితనాన్ని పెంపొందించుకున్నారు.
మోటిఫ్స్, తయారీ ప్రాంతం ఆధారంగా జందానీ చీరలను వర్గీకరిస్తారు. పన్నా హజార్ లేదా వెయ్యి పచ్చలు, కల్కా లేదా పెయిస్లీ, బుటిదార్ లేదా చిన్న పువ్వులు, ఫుల్వార్, టెర్సా, జలాల్, డురియా, కర్కోనా మోటిఫ్స్ అత్యంత ఎక్కువగా ప్రజాదరణ పొందాయి
గతంలో జందానీ చీరలు కేవలం రాజ కుటుంబాలకే పరిమొతమై ఉండేవి. కానీ నేడు ఫ్యాషన్‌ను ఇష్టపడే మహిళలందరూ ఈ చీరల మీద మక్కువను ప్రదర్శిస్తున్నారు. కుటుంబ వేడుకలు, పండుగల్లో ఈ చీరలకే పెద్ద పీట వేస్తున్నారు
బంగ్లాదేశ్‌లో రూపొందే ఢకాయి జందానీ చీరలు, తంగాయి జిల్లాలో రూపొందిన జందానీ చీరలు పెద్ద బార్డరును కలిగి ఉండి, పద్మం, దీపం, చేప పొలుసుక మోటి్‌ఫ్సను కలిగి ఉంటాయి. హూందాగా కనిపించే ఈ చీరలు సాయంకాలం వేళ వేడుకులకు అనువుగా ఉంటాయి
తేలికపాటి ఆభరణాలు జందానీ చీరలకు ఎంతో బాగా నప్పుతాయి. అలాగే ఆక్సిడైజ్‌డ్ సిల్వర్ జ్యువెలరీ కూడా
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం