Share News

Discover the Beauty: తంగలియా తమాషా

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:57 AM

ఎఫ్‌1 సినిమాలో హాలీవుడ్‌ కథానాయకుడు బ్రాడ్‌ పిట్‌ వేసుకున్న నీలం రంగు చొక్కా భారతీయ సంప్రదాయ తంగలియా చేనేత పనితనమే! పిట్‌ పోషించిన సానీ హేయ్స్‌ పాత్రకు ప్రామాణికతను తెచ్చిపెట్టడం...

Discover the Beauty: తంగలియా తమాషా

ఫ్యాషన్‌

ఎఫ్‌1 సినిమాలో హాలీవుడ్‌ కథానాయకుడు బ్రాడ్‌ పిట్‌ వేసుకున్న నీలం రంగు చొక్కా భారతీయ సంప్రదాయ తంగలియా చేనేత పనితనమే! పిట్‌ పోషించిన సానీ హేయ్స్‌ పాత్రకు ప్రామాణికతను తెచ్చిపెట్టడం కోసం, ప్రఖ్యాత కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌, జులియన్‌ డే తంగలియా వస్త్రాన్ని ఎంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ వస్త్రంతో రూపొందే మరికొన్ని దుస్తుల గురించి తెలుసుకుందాం!

అన్ని వస్త్రాలూ అన్ని వాతావరణలకూ అనువుగా ఉండవు. కానీ సహజసిద్ధ రంగులతో, పోగులతో రూపొందే చేనేత వస్త్రాలు ఇందుకు మినహాయింపు. అలాంటి వాటిలో చెప్పుకోదగినది తంగలియా చేనేత. ఇది గుజరాత్‌, సురేంద్రనగర్‌, కచ్‌ జిల్లాలకు చెందిన పూర్వీకుల చేతి వృత్తి. పూసలు లేదా దానాలను పోలిన ఆకృతితో వస్త్రానికి రెండు వైపులా కనిపించే మోటి్‌ఫలను సృష్టించడం ఈ నేత ప్రత్యేకత. బ్రాడ్‌ పిట్‌ ధరించిన చొక్కా పర్యావరణానుకూల ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా 100ు ఫ్రక్టోజ్‌లో పులియబెట్టి, సహజసిద్ధ ఇండిగో రంగును అద్దడం జరిగింది. ఈ చొక్కా తయారీ కోసం 8 మంది నిపుణులతో కూడిన చేనేత కళాకారుల బృందం, ఏకంగా తొమ్మిదిన్నర గంటల పాటు కష్టపడడం కూడా చెప్పుకోదగిన విశేషమే!


  • దానా: దానేదార్‌ అంటే, గింజల్లా ఉబ్బెత్తుగా కనిపించేవి అని అర్థం. ఈ ఆకృతిని పోలిన సూక్ష్మమైన, పూసలను పోలిన తంగలియా పనితనమే ‘దానా’! ఈ నేత ప్రక్రియ తంగలియా వస్త్రాలన్నిట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది.

  • జామెట్రీ మోటిఫ్స్‌: తంగలియా వస్త్రాల్లో వలయాలు, నిలువు గీతలు, ఇతరత్రా జామెట్రీ ఆకారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి.

  • సంప్రదాయ ముద్ర: ఒకానొకప్పుడు భార్వాడ్‌ గొర్రెల కాపరుల సమాజం, తంగలియా చేనేతతో శాలువాలు, స్కర్ట్‌లను తయారుచేసుకుంటూ ఉండేది. కానీ నేడు ఈ చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొంది, ప్రపంచవ్యాప్త డిజైనర్ల మనసులను దోచుకుంటున్నాయి.

  • సంప్రదాయ వస్త్రధారణను ఇష్టపడేవారు, సౌకర్యానికి పెద్ద పీట వేసేవారు తంగలియా వస్త్రాలను నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.

  • తేలిక రంగుల్లో తయారయ్యే ఈ వస్త్రాలను తేలికపాటి ఆభరణాలతో జత చేయడమే ఉత్తమం. హూందాగా కనిపించాలనుకునే మహిళలు తంగలియా చీరలు, శాలువాలు, లెహంగాలను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక

రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 05:07 AM