Share News

Salt Types: ఉప్పు ఇన్ని రకాలా?

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:58 AM

వంటకాల తయారీకి ఉప్పు అత్యవసరం. రంగు, రుచి, ఆకారాన్ని అనుసరించి ఉప్పు ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం..!

Salt Types: ఉప్పు ఇన్ని రకాలా?

టేబుల్‌ సాల్ట్‌ : ఇది మనం ప్రతిరోజూ వంటల్లో ఉపయోగించే సాధారణ ఉప్పు. సముద్రపు ఉప్పుని శుద్ది చేసి దీనిని తయారు చేస్తారు. ఇందులో ఉండే అయోడిన్‌ థైరాయిడ్‌ పనితీరుని మెరుగుపరుస్తుంది.

సీ సాల్ట్‌ : సముద్రపు నీటిని ఆవిరి చేసి దీనిని ఉత్పత్తి చేస్తారు. ఇది చిన్న స్ఫటికాల మాదిరి మెరుస్తూ ఉంటుంది. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్‌, ఇనుము లాంటి ఖనిజాలు ఉంటాయి.

హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ : ఇది హిమాలయ పర్వతాల్లో దొరుకుతుంది. దీనిని అత్యంత పరిశు భ్రమైన ఉప్పుగా పరిగణిస్తారు. ఇది ముతకగా కనిపిస్తూ ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. ఇందులో సోడియం చాలా తక్కువ. వంటల్లో వాడడంవల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో పీహెచ్‌ స్థాయి సమతౌల్యంలో ఉంటుంది. టాక్సిన్లు విసర్జితమవు తాయి. పోషకాలను శోషించుకునే శక్తి పెరుగుతుంది.

కోషెర్‌ సాల్ట్‌ : దీనిని కిచెన్‌ సాల్ట్‌ అని కూడా అంటారు. ఇది తెల్లగా చిన్న రాళ్ల మాదిరి ఉంటుంది. ఇందులో అయోడిన్‌ ఉండదు. దీనిని ఎక్కువగా మసాలా గ్రేవీలు, మాంసాహార కూరల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు.

బ్లాక్‌ సాల్ట్‌: ఇది లేత గులాబీ రంగులో ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. ఇందులో సల్ఫర్‌ సహా పలు పోషకాలు ఉంటాయి. అందరూ ఇష్టపడే పానీపూరీ నీళ్లలో దీనినే కలుపుతారు. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది.

సైంధవ లవణం: సముద్రపు నీటిని ఆవిరి చేసినప్పుడు ఏర్పడే లేత ఎరుపు రంగు స్ఫటికాలను సైంధవ లవణంగా పరిగణిస్తారు. ఇందులో అయోడిన్‌ తక్కువ. ఎలకో్ట్రలైట్స్‌, న్యూట్రియెంట్స్‌ ఎక్కువ. దీనిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.


ఇవి కూాడా చదవండి..

Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2025 | 05:58 AM