Share News

Diabetes: నడకలో నలతలు

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:01 AM

నడిచేటప్పుడు కొన్ని మధుమేహ లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. వాటిని కనిపెట్టి, వెంటనే అప్రమత్తం కాగలిగితే మధుమేహ చికిత్స ఆలస్యమవకుండా ఉంటుంది. ఆ లక్షణాలు ఏవంటే...

 Diabetes: నడకలో నలతలు

అరచేతులు, పాదాల్లో తిమ్మిర్లు: అధిక చక్కెర రక్తప్రసరణను ప్రభావితం చేసి, నాడులను దెబ్బతీస్తుంది. దాంతో అరచేతులు, పాదాల్లో నొప్పి, తిమ్మిర్లు వేధిస్తాయి. దీన్నే న్యూరోపతీ అంటారు. ఈ లక్షణాలతో పాటు సూదులు గుచ్చినట్టు కూడా అనిపించవచ్చు

నొప్పులు: కాళ్లలో నొప్పులు వేధిస్తాయి. ఇది కూడా నాడీ నష్టానికి సూచనే! దీర్ఘకాలికంగా అత్యధిక చక్కెరలను కలిగి ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. కాళ్లలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కూడా కాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి నొప్పులకు కారణాన్ని తెలుసుకోవాలి

అలసట: క్రమం తప్పక నడక అలవాటు ఉన్నప్పటికీ, కొత్తగా అలసట మొదలైనా, కొద్ది దూరానికే ఓపిక నశిస్తున్నా వెంటనే అప్రమత్తం కావాలి. చక్కెర పెరిగినా, తగ్గినా అలసట, నిస్సత్తువలు వేధిస్తాయి. నిరంతరం అలసట వేధిస్తున్నా, సరిపడా విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిస్సత్తువగా ఉంటున్నా, శరీరం చక్కెరను సమర్థవంతంగా నిర్వహించడం లేదని అర్థం.

పాదాల్లో వాపులు: నడక ముగించుకున్న తర్వాత పాదాలు, కాలి గిలకలూ వాస్తుంటే రక్తంలో చక్కెర మోతాదులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. మధుమేహం మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా శరీరంలో నీటి నిల్వ పెరిగి, పాదాలు, కాలి గిలకల్లో వాపులు మొదలవుతాయి.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:01 AM