Share News

Cucumber Health Benefits: కీరదోసలో ప్రత్యేకతలెన్నో

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:26 AM

మనం ప్రతి రోజూ తినే కూరగాయాల్లో కూడా అనేక ఔషధ లక్షణాలు ఉంటాయి. ఆయిర్వేదం వాటిని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తుంది. అలాంటి కూరగాయల్లో కీరదోస కూడా ఒకటి...

Cucumber Health Benefits: కీరదోసలో ప్రత్యేకతలెన్నో

భోజన కుతూహలం

మనం ప్రతి రోజూ తినే కూరగాయాల్లో కూడా అనేక ఔషధ లక్షణాలు ఉంటాయి. ఆయిర్వేదం వాటిని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తుంది. అలాంటి కూరగాయల్లో కీరదోస కూడా ఒకటి.

కీరదోస, కర్బూజ, పుచ్చకాయ లాంటివి ఒకప్పుడు కేవలం వేసవికాలంలో మాత్రమే మార్కెట్టుకి వచ్చి వేసవి అయిపోగానే కనుమరుగయ్యేవి. ఇప్పుడవి అన్ని సీజన్లలోనూ దొరుకుతున్నాయి. వీటన్నింటిలోను కీరదోసకు ఒక విశిష్టత ఉంది. భోజన కుతూహలం గ్రంధంలో కీరదోసను ‘కర్కటీ’ అని పేర్కొన్నారు. దీని నుంచి బహుశా ‘కక్కడ్‌’ అనే పదం పుట్టి ఉంటుంది. ఈ కీరదోస వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఆయిర్వేద గ్రంధాలు చెప్పాయి.

  • కీరదోసకాయలు అమితమయిన చలువ చేస్తాయి. కఫాన్ని, వేడిని హరిస్తాయి.

  • ఇవి రక్తదోషాలను తగ్గిస్తాయి.

  • వాంతులు, తలతిరుగుడు, తలనెప్పి మొదలైన వాటికి ఇవి మంచి మందు.

  • మూత్రంలో మంట, మూత్రం సరిగ్గా కాకపోవటం మొదలైన వాటికి కీరదోస బాగా పనిచేస్తుంది.

ఎలా వాడుకోవచ్చు

జ్యూస్‌గా: కీరదోస పైన తొక్క తీసి ముక్కలుగా తరిగి జ్యూస్‌ చేసుకొని తాగితే బీపీ తగ్గుతుంది. స్థూలకాయులకు ప్రతి రోజు ఈ జ్యూస్‌ తాగితే బరువు తగ్గుతారు. క్యారెట్‌, ముల్లంగి, కీర ముక్కలను తరిగి జ్యూస్‌ చేసుకొని తాగితే అనేక ఫలితాలు ఉంటాయి.

కూరగా: చాలా ప్రాంతాల్లో సొరకాయ బదులుగా కీరదోసను ఉపయోగించి కూరను తయారుచేస్తారు. ఇదే విధంగా- కీర ముక్కలను నూనెలో వేసి మగ్గపెట్టి తాళింపు వేస్తే రుచికరమైన కూర తయారవుతుంది. కొందరు దీనిలో ఉడికించిన కందిపప్పు కూడా వేస్తారు.

పాయసం: కీరదోసలో ఉన్న గింజలన్నింటినీ తీసి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీనిని పాలలో ఉడికించి.. చక్కెర, ఏలకులు వేస్తే పాయసం తయారవుతుంది.

గంగరాజు అరుణాదేవి

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 05:26 AM