Share News

Shashi Tharoor: ప్రస్తుతానికి కాంగ్రె్‌సలోనే ఉన్నా..

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:57 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడాన్ని, అలాగే, కేరళలోని వామపక్ష ప్రభుత్వ విధానాలను శశి థరూర్‌ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా మలయాళం పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor: ప్రస్తుతానికి కాంగ్రె్‌సలోనే ఉన్నా..

పార్టీ వద్దనుకుంటే నాకూ

ప్రత్యామ్నాయాలు ఉన్నాయి

దేశ, కేరళ ప్రయోజనాల కోసమే

మోదీపై, లెఫ్ట్‌ సర్కార్‌పై ప్రశంసలు

ఎప్పుడూ పార్టీ లబ్ధి కోసమే మాట్లాడడం నా వల్ల కాదు: థరూర్‌

తిరువనంతపురం, ఫిబ్రవరి 23: ప్రస్తుతానికి కాంగ్రె్‌సలోనే ఉన్నానని, తన సేవలను వినియోగించుకోకూడదని పార్టీ భావిస్తే గనుక తనకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశి థరూర్‌ తేల్చిచెప్పారు. అయితే, పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడాన్ని, అలాగే, కేరళలోని వామపక్ష ప్రభుత్వ విధానాలను శశి థరూర్‌ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా మలయాళం పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

f.jpg

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళలో కొత్త ఓటర్లను ఆకర్షించడం ద్వారా పార్టీని విస్తరించాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో వరుసగా మూడోసారీ కేరళలో ప్రతిపక్షంలోనే పార్టీ కూర్చోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.


కేరళలో పార్టీకి నాయకత్వం లోపించిందనే తన అభిప్రాయాన్ని పార్టీలోని ఇతర నేతలూ సమర్థిస్తున్నారన్నారు. కేరళ సీఎం పదవికి తాను అర్హుడినని పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలు నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌.. కేరళ కాంగ్రె్‌సలో తననే ముందు వరుసలో నిలిపినట్టు చెప్పారు. కాగా, మోదీని, వామపక్ష ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈనెల 18న ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని శశిథరూర్‌ కలిశారు. గంటన్నర సేపు ఏకాంతంగా జరిగిన ఆ భేటీలో కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని శశిథరూర్‌ చెప్పారు. పార్టీలో తనను పక్కన పెట్టడంపై ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించగా, లేదని సమాధానం ఇచ్చారు. దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే ఆ ప్రశంసలు చేశానని, ఎల్లప్పుడూ పార్టీ ప్రయోజనాల కోసమే మాట్లాడటం తనవల్ల కాదని తేల్చిచెప్పారు. తానెప్పుడూ సంకుచిత రాజకీయ ఆలోచనలతో లేనన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన

Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన

PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 04:57 AM