సీఐఎ్‌సఎ్‌ఫలో కానిస్టేబుల్ ఉద్యోగాలు
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:21 AM
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎ్‌సఎ్‌ఫ)లో వివిధ సెక్టార్‌లో ఖాళీగా ఉన్న 1161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో...
1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మన్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎ్‌సఎ్‌ఫ)లో వివిధ సెక్టార్‌లో ఖాళీగా ఉన్న 1161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2025 ఏప్రిల్ 3. నోటిఫికేషన్‌లో ప్రకటించిన ఖాళీల్లో 493 కానిస్టేబుల్/కుక్, కానిస్టేబుల్/వాషర్‌మన్ 262, కానిస్టేబుల్ బార్బర్ 199, కానిస్టేబుల్/స్వీపర్ 152, కానిస్టేబుల్/కార్పెంటర్ 9, కానిస్టేబుల్/టైలర్ 23 మొదలైన 13 రకాల పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ స్టాండెడ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 2025 ఆగ్‌స్ట1వ తేదీ నాటికి 18 నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉండాలి. 2025 మార్చి 5వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
1124 కానిస్టేబుల్/డ్రైవర్
సీఐఎ్‌సఎ్‌ఫలో 1124 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 845 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు, కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు 279 ఉన్నాయి. పదో తరగతితోపాటు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. చివరి తేదీ 2025 మార్చి 4. దరఖాస్తు దాఖలు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 మధ్యలో ఉండాలి. రెండు పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం జ్ట్టిఞట://ఛిజీటజట్ఛఛ్ట్టి.ఛిజీటజ.జౌఠి.జీుఽ/ వెబ్‌సైట్ చూడవచ్చు.
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా