Share News

Lady Finger Nutrition: బరువు తగ్గించే బెండ

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:13 AM

అధిక పీచుతో పాటు శరీరం శక్తిని ఖర్చు చేసుకోగలిగే ప్రయోజనాలను కలిగి ఉన్న బెండకాయలతో తయారయ్యే పానీయం బరువు తగ్గించే పానీయంగా సర్వత్రా ఆదరణ పొందుతోంది. ఎందుకో...

Lady Finger Nutrition: బరువు తగ్గించే బెండ

అధిక పీచుతో పాటు శరీరం శక్తిని ఖర్చు చేసుకోగలిగే ప్రయోజనాలను కలిగి ఉన్న బెండకాయలతో తయారయ్యే పానీయం బరువు తగ్గించే పానీయంగా సర్వత్రా ఆదరణ పొందుతోంది. ఎందుకో తెలుసుకుందాం!

విటమిన్‌ సి, మెగ్నీషియం, ఫోలేట్‌లతో పాటు నీటిలో కరిగే పీచును కలిగి ఉన్న బెండ జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఎక్కువ సమయం పాటు ఆకలిని కూడా నియంత్రించగలుగుతుంది. అలాగే బెండకాయల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచుతుంది. బెండకాయల్లోని జిగురు, పేగులు చక్కెరను శోషించుకునే విధానాన్ని నెమ్మదింపజేసి, కొవ్వు నిల్వతో సంబంధమున్న ఇన్సులిన్‌ పెరుగుదలను నియంత్రిస్తుంది. అయితే అలాగని నచ్చిన సమయంలో బెండకాయ నీళ్లు తాగితే ఫలితం ఉండదు. అందుకోసం కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఈ నీళ్లను ఉదయం అల్పాహారానికి ముప్పై నిమిషాల ముందు తాగాలి. ఈ నీళ్ల తయారీ కోసం నాలుగు బెండకాయలను పలుచని చక్రాల్లా తరిగి, సీసా నీళ్లలో కలిపి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఈ నీళ్లను వడగట్టి బ్రేక్‌ఫాస్ట్‌కు అరగంట ముందు తాగాలి. ఇలా చేస్తే, ఈ నీళ్లలోని పోషకాలన్నిటినీ శరీరం సమర్థంగా శోషించుకోగలుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..

‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 29 , 2025 | 05:13 AM