Share News

Boost Brain Health: కుడికి బదులు ఎడమ

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:22 AM

రోజూ చేసే చిన్న చిన్న పనులకు ఆధిపత్య చేతికి బదులుగా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన...

Boost Brain Health: కుడికి బదులు ఎడమ

మీకు తెలుసా?

రోజూ చేసే చిన్న చిన్న పనులకు ఆధిపత్య చేతికి బదులుగా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

మన మెదడు చిన్న చిన్న సవాళ్లను ఇష్టపడుతుంది. కుడి చేత్తో పనులు చేసే అలవాటున్న వాళ్లు అవే పనులను ఎడమ చేత్తో చేయడం మొదలుపెడితే మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటూ ఉంటారు. ఇలా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుకుదనం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సంతులనం కూడా పెరుగుతాయి. కాబట్టి కుడి చేత్తో దంతధావనం చేసుకునేవారు ఎడమచేత్తో బ్రష్‌ చేసుకోవడం మొదలుపెట్టొచ్చు. నిజానికి రెండు నిమిషాల నిడివితో కూడిన దైనందిన చర్య ఇది. అయినప్పటికీ ఈ స్వల్ప సమయమే మెదడుకు వ్యాయామంగా మారి, నాడీ సంబంధాలను పెంచుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More TG News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 02:22 AM