Summer Skincare: అందమైన చర్మం కోసం పానీయాలు..
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:55 AM
వేసవిలో ఆరోగ్యకరమైన పానీయాలు సేవించడం వల్ల చర్మం మెరిసిపోతుంది. గ్రీన్‌టీ, నిమ్మరసం, అల్లం, కలబంద, పసుపు, నారింజ, క్యారెట్, పుచ్చకాయ వంటి పానీయాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

సరైన పోషకాలు అందినప్పుడే చర్మం అందంగా కనిపిస్తుంది. ఈ వేసవిలో ఆరోగ్యకరమైన పానీయాలు సేవించి చక్కని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మాన్ని మెరిపించే పానీయాలు ఇవే...
ఎండాకాలంలో తేనె కలిపిన గ్రీన్ టీ తాగడం మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపుతాయి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా అల్లం రసం కలుపుకుని తాగితే చర్మానికి కొత్త కాంతి లభిస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా కలబంద జ్యూస్ కలుపుకుని తాగితే చర్మం తేమగా ఉంటుంది. ఎండ వల్ల కమిలిన చర్మం యథాస్థితికి వస్తుంది. ముఖం మీద మొటిమలు రావు.
ఒక గ్లాసు వేడి నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే చర్మం బిగుతుగా మారుతుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను నిరోధిస్తాయి.
వేసవికాలంలో వారానికి రెండుసార్లు నారింజ రసం తాగుతూ ఉంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మీద ముడతలు మాయమవుతాయి.
ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎ, కె, సి విటమిన్లు అంది చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
పుచ్చకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. కొద్దిగా ఫైబర్, గ్లూకోజ్ తదితరాలు కూడా ఉంటాయి. తరచూ పుచ్చకాయ రసం తాగుతూ ఉంటే చర్మం ఛాయగా ఉంటుంది.
ప్రతిరోజూ కీర దోస జ్యూస్ తాగితే...చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News