Hydration: వేడి తగ్గాలంటే...
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:29 AM
వేసవికాలంలో సాధారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. తరచుగా తాజా పండ్లు తింటూ ఉంటే శరీరంలో నీటి శాతం పెరిగి వేడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు
శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీక రించడంలో అరటిపండుది ప్రథమ స్థానం. ఈ పండును తినడం వల్ల పేగుల్లో వేడి తగ్గుతుంది. కాబట్టి మలబద్ధకం రాదు.
నారింజ
ఈ పండులో విటమిన్-సితో పాటు ఫైబర్, గ్లూకోజ్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది వేసవిలో దాహాన్ని తగ్గిస్తుంది. మధ్యాహ్న సమయంలో నారింజపండుని తింటే శరీరంలో వేడి తగ్గి శక్తి లభిస్తుంది.
కీరా
సహజంగా చల్లబరిచే గుణాలు దీనిలో పుష్కలం. దీనిలో నీరు కూడా అధికంగా ఉంటుంది. వేసవికాలంలో ప్రతిరోజూ కీరా ముక్కలపై ఉప్పు వేసుకుని తింటే వడదెబ్బ తగలదు. పొట్టలో వేడి తగ్గి చల్లగా అనిపిస్తుంది.
కర్బూజ పండు
ఇందులో బి, సి విటమిన్లతో పాటు అధికంగా పొటాషియం, సోడియం మెగ్నీషియం, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ వేసవి తాపాన్ని తగ్గిస్తాయి.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.