Share News

beauty Tips With Kitchen Spices: అందానికి మసాలాలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 02:00 AM

వంటకాల రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే మసాలా దినుసులు చర్మ సౌందర్యానికి కూడా ఉపకరిస్తాయని తెలుసా...

beauty Tips  With Kitchen Spices: అందానికి మసాలాలు

వంటకాల రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే మసాలా దినుసులు చర్మ సౌందర్యానికి కూడా ఉపకరిస్తాయని తెలుసా?

  • జీలకర్రలో ఇ విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. రోజూ వంటకాల్లో చేర్చడం వల్ల చర్మం మీద ముడుతలు ఏర్పడవు. అకాల వార్థక్యం దరి చేరదు. గ్లాసు మంచినీటిలో అర చెంచా జీలకర్ర వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే తాగితే శరీరంలోని వ్యర్థపదార్థాలన్నీ విసర్జితమవుతాయి. చర్మం తేమతో నిండి ఛాయగా మెరుస్తుంది.

  • దాల్చిన చెక్కలో బి, కె విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌, బీటా కెరోటిన్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. తరచూ ఆహారంలో చేరిస్తే రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. చర్మం పొరల్లో సెబమ్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ముఖం మీద మొటిమలు, గుల్లలు రావు. చిన్న గిన్నెలో చెంచా దాల్చిన చెక్క పొడి, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే చర్మ రంధ్రాలు పూర్తిగా శుభ్రపడతాయి. నల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

  • జాజికాయలో ఎ, బి, సి విటమిన్లతోపాటు ఐరన్‌, కాపర్‌, జింక్‌, కాల్షియం, పొటాషియం, మాంగనీస్‌ తదితర మినరల్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి జీవక్రియలను వేగవంతం చేసి మంచి నిద్రను ప్రేరేపిస్తాయి. దీనివల్ల చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది.

  • లవంగాలలో సి, కె విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి మినరల్స్‌ మెండు. లవంగాలు తీసుకొంటే చర్మం పొడిబారడం, చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయి. గిన్నెలో రెండు చెంచాల కొబ్బరి నూనె, మూడు చుక్కల లవంగ నూనె వేసి బాగా కలిపి రాత్రి పడుకునేముందు ముఖానికి పట్టిస్తే మొటిమల సమస్య తీరుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2025 | 02:00 AM