Share News

Cancer Risk: కృత్రిమ చక్కెర చేటు

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:33 AM

కృత్రిమ చక్కెర ఆస్పర్టేమ్‌, పేగుల్లోని బ్యాక్టీరియాతో పాటు, జియోబ్లాస్టోమా అనే క్యాన్సర్‌తో సంబంధమున్న జన్యువుల రూపురేఖలను మార్చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. మరిన్ని వివరాలు...

Cancer Risk: కృత్రిమ చక్కెర చేటు

అప్రమత్తం

కృత్రిమ చక్కెర ఆస్పర్టేమ్‌, పేగుల్లోని బ్యాక్టీరియాతో పాటు, జియోబ్లాస్టోమా అనే క్యాన్సర్‌తో సంబంధమున్న జన్యువుల రూపురేఖలను మార్చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. మరిన్ని వివరాలు...

గతంలో అనుకున్నట్టు కృత్రిమ చక్కెర, ఆస్పర్టేమ్‌ ఇక మీదట ఏమాత్రం సురక్షితం కాదు. ఈ చక్కెరతో పేగులు, మెదడు, పునరుత్పత్తి వ్యవస్థ, రక్తం... ఇలా బహుళ క్యాన్సర్ల ముప్పు పెరిగే ప్రమాదముందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ చక్కెరతో తలనొప్పులు పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా క్షీణిస్తుంది. డైట్‌ పానీయాలు, రక్త క్యాన్సర్‌ ముప్పుకూ అత్యధిక ఆస్పర్టేమ్‌ మోతాదులకూ మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టడంలో తొలినాళ్ల అధ్యయనాలు విఫలమైనప్పటికీ, ఆస్పర్టేమ్‌ పేగుల్లోని మైక్రోబియంను నేరుగా ప్రభావితం చేసి, గ్లయోబ్లాస్టోమా అనే క్యాన్సర్‌ ముప్పును పెంచుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. తాజా ఆధారాలు గ్లయోబ్లాస్టోమా చికిత్స వ్యూహాలను అంచనా వేయడంలో వైద్యులకు సహాయపడతాయనీ, జీన్‌ టార్గెటెడ్‌ థెరపీలతో పాటు, మైక్రోబియం ఆధారిత చికిత్సలకు కొత్త మార్గాలు తెరుస్తాయనీ పరిశోధకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 01:34 AM