ఏపీ ‘ఈఏపీసెట్’
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:02 AM
ఆంధ్రప్రదేశ్ ‘ఈఏపీసెట్’ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకున్న విద్యార్థులుhttps://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు.
అడ్మిషన్స్
ఆంధ్రప్రదేశ్ ‘ఈఏపీసెట్’ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలనుకున్న విద్యార్థులు https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2025 ఏప్రిల్ 24. కరెక్షన్లకు మే 6వ తేదీ నుంచి మే 8 వరకు అవకాశం ఉంటుంది. మే 12 నుంచి ఈఏపీసెట్ వెబ్‌సైట్‌తోపాటు, రాష్ట్రప్రభుత్వ వాట్సాప్ నంబర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్ కోర్సులకు ఎంట్రెన్స్ మే 19, 20 తేదీల్లో, ఇంజనీరింగ్ కోర్సులకు మే 21 నుంచి 27 నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని 46 కేంద్రాల్లో, హైదరాబాద్‌లోని రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకున్నవారు కర్నూలులోని ప్రాంతీయ కేంద్రంలో ఎంట్రెన్స్ రాయాల్సి ఉంటుంది.
ఎంట్రెన్స్ విధానం:
ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 80 మేథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్, మల్టీపుట్ చాయిస్ ప్రశ్నలు.
అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ ప్రశ్న పత్రంలో కూడా 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో బయాలజీ 80(బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఉంటాయి.
ఫీజు: దరఖాస్తుతోపాటు జనరల్ అభ్యర్థులు రూ.600/-, బీసీ అభ్యర్థులు రూ.550/-, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ. 500/- చెల్లించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత