Share News

అవన్నీ ప్రయోజనంలేని పనులు

ABN , Publish Date - Feb 14 , 2025 | 02:53 AM

కరిరాజున్‌ బిసతంత సంతతులచేగట్టన్‌ విజృంభించు వా డురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప దీ పరచింతన్‌...

అవన్నీ ప్రయోజనంలేని పనులు

సుభాషితం

కరిరాజున్‌ బిసతంత సంతతులచేగట్టన్‌ విజృంభించు వా

డురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప దీ

పరచింతన్‌ లవణాబ్ధికిన్‌ మధుకణ ప్రాప్తిం బ్రవర్తించు ని

ద్ధరణిన్‌ మూర్ఖుల దెల్పునెవ్వడు సుధా ధారానుకారోక్తులన్‌

.భర్తృహరి ‘నీతిశతకం’లోని ‘వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే...’ అనే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి తెలుగు వారికి ఈ పద్య రూపంలో అందించారు.

భావం: మూర్ఖుల తీరును మార్చడం కష్టం. తామర తూళ్ళతో చేసిన దారాలతో మదపుటేనుగును బంధించాలనే ఆలోచన, దిరిసెన పువ్వు కొనతో వజ్రానికి సాన పట్టాలనే ప్రయత్నం, అనంతమైన ఉప్పు సముద్రాన్ని చిన్న తేనెబొట్టుతో తియ్యగా మార్చాలనుకోవడం

నిరర్థకమైన పనులు. మూర్ఖులను మంచి మాటలతో మార్చాలనుకొనేవారు కూడా అలాంటి ప్రయోజనం లేని పనులు చేసేవారి కోవకే చెందుతారు.


ఇవి కూాడా చదవండి..

Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Maha Kumbh Mela 2025: మాఘపూర్ణిమ సందర్భంగా కుంభ మేళాకు పోటెత్తిన భక్తజనం.. 6 గంటల నాటికి 73.60 లక్షల మంది

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2025 | 02:53 AM