Alcohol: మద్యంతో ముప్పులు
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:45 AM
మద్యపానం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యంతో ఆరోగ్యానికి పొంచి ఉండే ప్రధాన ముప్పులు ఏవంటే...
క్యాన్సర్ ముప్పు: ఆల్కహాల్‌కు ‘కార్సినోజెన్’ అనే పేరుంది. అంటే మద్యంతో రొమ్ములు, కాలేయం, తల, మెడ, గొంతు, పెద్దపేగు.. ఇలా పలురకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది
కాలేయ జబ్బు: తీవ్ర మద్యపాన వ్యసనంతో కాలేయానికి కొవ్వు పడుతుంది. మద్యం సంబంధిత కామెర్లు, కాలేయం గట్టిపడే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, కాలేయ వైఫల్యం సమస్యలు పొంచి ఉంటాయి
గుండె జబ్బులు: రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ క్రమం తప్పుతుంది. గుండెపోటు ముప్పు పెరుగుతుంది
ఇన్‌ఫెక్షన్లు: వ్యాధినిరోధకశక్తి బలహీనపడుతుంది. ఫలితంగా క్షయ లాంటి ఇన్‌ఫెక్షన్లు సులభంగా సోకుతాయి
నాడీ నష్టం: దీర్ఘకాలం పాటు విపరీతంగా మద్యం తాగితే, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మద్యం సంబంధిత బ్రెయిన్ డ్యామేజీ జరుగుతుంది
స్వీయ హాని: మద్యం నిర్ణయ సామర్థ్యాన్ని కుంటు పరుస్తుంది. ఆత్మహత్య, స్వీయ హాని ఆలోచనలను పెంచుతుంది. భావోద్వేగాలు అదుపుతప్పేలా చేస్తుంది
మానసిక కుంగుబాటు: మద్యంతో మానసిక కుంగుబాటు, ఆందోళనలు పెరుగుతాయి
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.