Share News

Kerala Government: స్కూల్లో జుంబా డ్యాన్స్‌ చేయాల్సిందే

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:40 AM

కేరళ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా పిల్లల దేహదారుఢ్యాన్ని పెంచే జుంబా డ్యాన్స్‌ను ప్రవేశపెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Kerala Government: స్కూల్లో జుంబా డ్యాన్స్‌ చేయాల్సిందే

  • కేరళ విద్యామంత్రి శివన్‌కుట్టి స్పష్టీకరణ

కోచి, జూన్‌ 28: కేరళ పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా పిల్లల దేహదారుఢ్యాన్ని పెంచే జుంబా డ్యాన్స్‌ను ప్రవేశపెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని అక్కడి ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జుంబా పేరుతో ఆడ, మగ కలిసి మెలిసి వ్యవహరించడాన్ని, కురచ దుస్తుల్లో కలిసి నృత్యం చేయడాన్ని సహించేది లేదని హెచ్చరించాయి. అయితే, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో ఉంది. మాదక ద్రవ్యాల కన్నా జుంబా నృత్యం పట్ల వ్యతిరేకతే ప్రమాదకరంగా ఉందని కేరళ విద్యామంత్రి శివన్‌కుట్టి వ్యాఖ్యానించారు. జుంబాను వ్యతిరేకించడం ద్వారా మతతత్వాన్ని ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. పాఠశాల కరిక్యులమ్‌లో జుంబా నృత్యాన్ని భాగంగా చేసినందున దాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. జుంబాకు పంపడం, పంపక పోవడం లాంటి చాయిస్‌ తల్లిదండ్రులకు లేదని తేల్చిచెప్పారు. పిల్లలకు కురచ దస్తులు వేసుకోవాలనే నిబంధన ఏమీ లేదని, రోజూ వేసుకొనే స్కూల్‌ డ్రస్‌తోనే జుంబా నృత్యం చేయవచ్చని అన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 03:44 AM