Share News

Jai Jagan Slogans: శబరిమలలో జై జగన్‌ నినాదాలు!

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:07 AM

బరిమలలో ఆయ్యప్ప ఆలయానికి వెళ్లే సమయంలో మాలధారులంతా స్వామిని ధ్యానిస్తూ లీనమై పోతారు. అయితే అనకాపల్లి జిల్లా...

Jai Jagan Slogans: శబరిమలలో జై జగన్‌ నినాదాలు!

పాయకరావుపేట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): శబరిమలలో ఆయ్యప్ప ఆలయానికి వెళ్లే సమయంలో మాలధారులంతా స్వామిని ధ్యానిస్తూ లీనమై పోతారు. అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం శబరిమల అయ్యప్ప స్వామిగుడికి కాలినడకన వెళుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బ్యానర్‌ను ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేరళలో పంప నుంచి సన్నిధానానికి వెళుతూ జగన్‌ 2.0 అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించడంతోపాటు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. పైగా దీన్ని వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసుకుంటున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 04:07 AM