Share News

Cyber Threats Over Morphed AI: మీ అక్కాచెల్లెళ్ల అభ్యంతరకర ఏఐ చిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతా

ABN , Publish Date - Oct 28 , 2025 | 03:39 AM

సైబర్‌ నేరగాళ్ల అకృత్యాలకు ఓ యువకుడు బలయ్యాడు. లక్షల్లో డబ్బులు పంపాలని లేకపోతే తన అక్కాచెల్లెళ్ల అభ్యంతరకర మార్ఫింగ్‌ ఫొటో..

Cyber Threats Over Morphed AI: మీ అక్కాచెల్లెళ్ల అభ్యంతరకర ఏఐ చిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతా

  • సైబర్‌ నేరగాడి బెదిరింపులతో హరియాణాలో ఓ యువకుడి ఆత్మహత్య

ఫరీదాబాద్‌, అక్టోబరు 27: సైబర్‌ నేరగాళ్ల అకృత్యాలకు ఓ యువకుడు బలయ్యాడు. లక్షల్లో డబ్బులు పంపాలని లేకపోతే తన అక్కాచెల్లెళ్ల అభ్యంతరకర మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. రాహుల్‌ భారతి (19) అనే యువకుడి ఫోన్‌ను రెండు వారాల క్రితం సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో ఉన్న ఆ యువకుడితో పాటు అతడి ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫొటోలు, వీడియోలను ఏఐ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి, ఆ చిత్రాలను ఆ యువకుడికి పంపి లక్షల్లో డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇవ్వకపోతే వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాహిల్‌ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు.

Updated Date - Oct 28 , 2025 | 03:39 AM