Share News

Karwa Chauth 2025: పెళ్లై 10 నెలలు.. చీర బహుమతిగా ఇవ్వలేదని..

ABN , Publish Date - Oct 11 , 2025 | 07:25 AM

బబ్లీకి 10 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ధర్మపాల్‌తో పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగుతోంది.

Karwa Chauth 2025: పెళ్లై 10 నెలలు.. చీర బహుమతిగా ఇవ్వలేదని..
Karwa Chauth 2025:

మనిషి ప్రాణాలకు బొత్తిగా విలువ లేకుండా పోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. కొంతమంది కష్టాలపై పోరాటం చేయలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొంతమంది అయిన వారితో గొడవల కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి పెళ్లైన 10 నెలలకే ప్రాణాలు తీసుకుంది. భర్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. షహనాజ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల బబ్లీకి 10 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ధర్మపాల్‌తో పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగుతోంది. గురువారం కార్వా చౌత్ పండుగ సందర్బంగా తనకు చీర బహుమతిగా కావాలని బబ్లీ తన భర్తను అడిగింది. దీనికి ధర్మపాల్ ఒప్పుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత ధర్మపాల్ బయటకు వెళ్లిపోయాడు.


ఇంట్లో ఒంటరిగా ఉన్న బబ్లీ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటికి వచ్చిన ధర్మపాల్.. లోపలి దృశ్యం షాక్ అయ్యాడు. భార్య చనిపోయిందని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బబ్లీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె మృతికి చీర కొనివ్వకపోవడమే కారణమా.. లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అదృష్టం బాగుంది.. లేదంటే ప్రాణాలు పోయేవి..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Updated Date - Oct 11 , 2025 | 10:51 AM