Share News

Google Maps: మళ్లీ ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:44 AM

గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని మరో కారు డ్రైవర్‌ నీట మునిగారు. ముంబైలో గూగుల్‌ మ్యాప్స్‌ చూపిన తప్పుదారిలో కారు నడుపుకొంటూ వెళ్లిన ఓ మహిళ చివరకు సముద్రం బ్యాక్‌ వాటర్‌ ప్రవహించే బేలో పడిపోయారు.

Google Maps: మళ్లీ ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌

  • ముంబైలో నీటి ప్రవాహంలోకి దూసుకెళ్లిన కారు

  • క్షేమంగా బయటపడ్డ డ్రైవర్‌

ముంబై, జూలై 26: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని మరో కారు డ్రైవర్‌ నీట మునిగారు. ముంబైలో గూగుల్‌ మ్యాప్స్‌ చూపిన తప్పుదారిలో కారు నడుపుకొంటూ వెళ్లిన ఓ మహిళ చివరకు సముద్రం బ్యాక్‌ వాటర్‌ ప్రవహించే బేలో పడిపోయారు. అక్కడ ఉన్న జెట్టీ సెక్యూరిటీ సిబ్బంది తక్షణం స్పందించడంతో ఆమె క్షేమంగా బయటపడ్డారు. శుక్రవారం నవీ ముంబైలోని బేలాపూర్‌ మీదుగా ఉల్వే వెళ్లడానికి ఆమె గూగుల్‌ మ్యాప్స్‌ను అనుసరించినపుడు ఈ ఘటన జరిగింది.


బేలాపూర్‌ వద్ద బే బ్రిడ్జిపై నుంచి చూపించాల్సిన దారిని గూగుల్‌ మ్యాప్స్‌ బ్రిడ్జి కింద నుంచి చూపింది. ఆ దారి ధ్రువతార జెట్టీ వద్దకు వెళ్తుంది. ఇది తెలియని ఆమె ముందుకే డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లారు. కొద్ది సేపటికే జెట్టీ నుంచి నీటిలో పడిపోయారు. ఇది చూసిన మెరైన్‌ సెక్యూరిటీ అధికారులు వెంటనే స్పందించారు. నీటిపై తేలుతున్న ఆమెను నిమిషాల వ్యవధిలోనే రక్షించారు. ఆమె కారును కూడా బయటకు తీశారు. గాయాలేవీ లేకుండానే ప్రమాదం నుంచి ఆ మహిళ బయటపడ్డారు.

Updated Date - Jul 27 , 2025 | 05:44 AM