Share News

Mysore: ప్రియురాలి నోట్లో జిలెటిన్‌ స్టిక్‌ పేల్చివేత

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:00 AM

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో లాడ్జికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైంది. నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తే ఆమె నోట్లో జిలెటిన్‌ స్టిక్‌ పెట్టి పేల్చి చంపేశాడు.

Mysore: ప్రియురాలి నోట్లో జిలెటిన్‌ స్టిక్‌ పేల్చివేత

బెంగళూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో లాడ్జికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైంది. నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తే ఆమె నోట్లో జిలెటిన్‌ స్టిక్‌ పెట్టి పేల్చి చంపేశాడు. మైసూరు జిల్లా భేర్య గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన మహిళను గరసనహళ్లి గ్రామానికి చెందిన రక్షిత(20)గా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రియుడు సిద్దరాజును అదుపులోకి తీసుకున్నారు. రక్షితకు కేరళకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది.


మైసూరు ప్రాంతానికి చెందిన సిద్దరాజు అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కప్పడి ఆలయానికి వెళదామని సిద్దరాజు పిలవడంతో రక్షిత వెంట వెళ్లింది. ఆమెను సిద్దరాజు లాడ్జికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన జెలిటిన్‌ స్టిక్‌ను ఆమె నోట్లో పెట్టి పేల్చాడు. పేలుడులో తనూ గాయపడ్డాడు.

Updated Date - Aug 26 , 2025 | 02:00 AM