Firozabad: ప్రియుడి కోసం భర్తకు రెండుసార్లు విషం పెట్టి హత్య
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:08 AM
: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తకు చంపాలనుకుందా భార్య! భోజనంలో విషం పెడితే.. తిని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఆ భర్త కోలుకుంటే రెండోసారి విషం పెట్టి చంపేసింది.
ఫిరోజాబాద్, జూలై 26: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తకు చంపాలనుకుందా భార్య! భోజనంలో విషం పెడితే.. తిని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఆ భర్త కోలుకుంటే రెండోసారి విషం పెట్టి చంపేసింది. యూపీలో ఫిరోజాబాద్ సమీపంలోని ఉలావు అనే గ్రామంలో ఈ ఘోరం జరిగింది. హతుడి పేరు సునీల్. అతడి భార్య గ్రామంలోనే మరో యువకుడితో చనువుగా ఉంటోంది.
మే 13న భోజనం చేశాక సునీల్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స చేసిన వైద్యులు మర్నాడు అతడిని డిశ్చార్జి చేశారు. కొన్నిరోజుల తర్వాత సునీల్ భార్య అతడికి పెరుగులో విషం కలిపి భోజనం పెట్టింది. ఈసారి తిన్నాక అతడు ప్రాణాలు విడిచాడు. సునీల్ మృతిపై అనుమానంతో అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో.. సునీల్‌ను చంపేందుకు అతడి భార్య ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి విషాన్ని తెప్పించుకుందని తేలింది. దీంతో, సునీల్ భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇవి.. పిల్లులే అంటే నమ్ముతారా..