Wife Donates Husband Eyes: కన్నెర్ర చేయలేదు...కళ్లను దానం చేసింది!
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:16 AM
విపత్కర స్థితిలో ఉన్న ఆమెను సమాజం పట్టించుకోలేదు....సాయం కోసం చేతులెత్తి మొక్కినా ఎవరూ స్పందించలేదు...ఫలితంగా భర్తను కోల్పోయింది...
భర్త ప్రాణాలకోసం తల్లడిల్లిన భార్య మానవత్వపు సందేశం
బెంగళూరు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): విపత్కర స్థితిలో ఉన్న ఆమెను సమాజం పట్టించుకోలేదు....సాయం కోసం చేతులెత్తి మొక్కినా ఎవరూ స్పందించలేదు...ఫలితంగా భర్తను కోల్పోయింది. అయినా, ఆమె సమాజంపై కన్నెర్ర చేయలేదు...మానవతా దృష్టితో భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరు నగరంలోని బనశంకరి ప్రాంతానికి చెందిన వెంకట రమణన్(34) గుండెపోటుతో నడిరోడ్డుపై కుప్పకూలి... వాహనదారులెవరూ సాయం చేయక, సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య రూప సాయం కోసం అర్థిస్తున్న వీడియో వైరల్ అయింది. అయితే, ‘సమాజం నా భర్త ప్రాణాలు కాపాడేందుకు రాలేదు., కానీ నేను మానవత్వంతో మరో ఇద్దరికి కంటిచూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని రూప.. తన భర్త వెంకటరమణన్ కళ్లను దానం చేశారు. సమాజానికి మానవత్వపు సందేశం పంపించారు.