Minister Aroop Biswas: బెంగాల్ క్రీడా శాఖ మంత్రి రాజీనామా
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:48 AM
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత పర్యటన సందర్భంగా కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న తీవ్ర గందరగోళం....
కోల్‌కతా, డిసెంబరు 16: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత పర్యటన సందర్భంగా కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న తీవ్ర గందరగోళం, నిర్వహణ లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లవెత్తుతున్న నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణకు వీలుగా తాను క్రీడా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బిస్వాస్ సీఎం మమతా బెనర్జీకి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ఆయన రాజీనామాను మమత ఆమోదించినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి క్రీడా శాఖ బాధ్యతలను మమత స్వయంగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు, ఈవెంట్ నిర్వహణ లోపాలపై డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్‌నగర్ పోలీస్ కమిషనర్ ముఖేశ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.