Old Pension Scheme: పాత పెన్షన్ అమలు చేసే పార్టీలకే ఓటు
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:48 AM
పాత పెన్షన్(ఓపీఎ్‌స) విధానం అమలు చేసే పార్టీలకే తమ ఓటు వేస్తామని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ జనరల్...
పట్నా పెన్షన్ సంఘర్ష్ సభలో స్థితప్రజ్ఞ
హైదరాబాద్/పట్నా, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పాత పెన్షన్(ఓపీఎ్‌స) విధానం అమలు చేసే పార్టీలకే తమ ఓటు వేస్తామని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం(ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ప్రకటించారు. నవంబరులో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్ర రాజధాని పట్నాలో ఆయన ఆధ్వర్యంలో ‘పెన్షన్ సంఘర్ష్’ పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ అంశం రాష్ట్రం పరిధిలోనిదన్నారు. ఇటీవల దేశంలోని కొన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ అమలు చేస్తామని తెలంగాణ, కర్ణాటకల్లో సీపీఎస్ ఉద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చాయన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ను పునరుద్ధరించిన తర్వాతే బిహార్‌లో తమ సీపీఎస్ ఉద్యోగులు ఆయా పార్టీలకు మద్దతు ఇస్తారన్నారు.