Share News

Justice Sudarshan Reddy: ఇతర పార్టీలూ మద్దతిస్తున్నాయి

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:10 AM

విపక్ష కూటమి ఇండియా తరఫున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న తనకు.. ఇండియాయేతర పార్టీలు ...

Justice Sudarshan Reddy: ఇతర పార్టీలూ మద్దతిస్తున్నాయి

  • ఉపరాష్ట్రపతి.. రాజకీయ పదవి కాదు

  • రెండో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవి

  • ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

లక్నో/న్యూఢిలీ, ఆగస్టు 26: విపక్ష కూటమి ఇండియా తరఫున ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న తనకు.. ఇండియాయేతర పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను కలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయ పదవి కాదని, దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అని.. కాబట్టి, తాను రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, డాక్టర్‌ జాకిర్‌హుస్సేన్‌, కేఆర్‌ నారాయణన్‌, హమీద్‌ అన్సారీ వంటి మేధావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు ఈ పదవిని ఇంతకుముందు అదిష్ఠించారని.. వారి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 03:10 AM