Share News

TJS George Passes Away: సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:35 AM

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో...

TJS George Passes Away: సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత

బెంగళూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్‌(97) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమార్తె శిబా తెలిపారు. 1938, మే 7న కేరళలో జన్మించిన జార్జ్‌.. 1950లో ప్రీ ప్రెస్‌ జర్నల్‌ ద్వారా బొంబాయిలో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘకాలం ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సలో కొనసాగారు. సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ పేరిట కాలమ్స్‌ రాశారు. 2007లో కన్నడ రాజ్యోత్సవ పురస్కారం, 2011లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 03:36 AM