Atal Bihari Vajpayee: పాకిస్థాన్‌ను కట్నంగా ఇస్తేనిన్ను పెళ్లాడేస్తా!
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:28 AM
సునిశిత ప్రసంగాలకు, సున్నిత హాస్యానికి దివంగత ప్రధాని వాజ్‌పేయీ పెట్టింది పేరు. ఆయన చతురతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం గుర్తు చేశారు..
ఆ దేశ మహిళతో వాజ్‌పేయీ హాస్యం
న్యూఢిల్లీ, డిసెంబరు 26: సునిశిత ప్రసంగాలకు, సున్నిత హాస్యానికి దివంగత ప్రధాని వాజ్‌పేయీ పెట్టింది పేరు. ఆయన చతురతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం గుర్తు చేశారు. వాజ్‌పేయీ 101 జయంతి సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగింస్తూ.. 1999 ఫిబ్రవరిలో వాజ్‌పేయీ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్పారు. అక్కడ ఒక మహిళ వాజ్‌పేయీని ఉద్దేశించి ‘నన్ను పెళ్లాడుతారా? అయితే కశ్మీర్‌ను బహుమతిగా ఇవ్వండి’ అని అడిగింది. అందుకు ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ‘మొత్తం పాకిస్థాన్‌ను కట్నంగా ఇస్తే పెళ్లాడెస్తా’ అని సమాధానం ఇచ్చారు. మరో సంఘటనను కూడా రాజ్‌నాథ్ సింగ్ ఉదహరించారు. ఇవి కేవలం హాస్యంగా అన్న మాటలు కావని, కశ్మీర్ పట్ల ఆయన దృక్పథానికి నిదర్శనాలని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.’