High Expenditure on Player Bananas: ఏడాదిలో ఆటగాళ్ల అరటిపండ్ల కోసం 35 లక్షలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:00 AM
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) దుబారా ఖర్చులపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది..
డెహ్రాడూన్, సెప్టెంబరు 10: ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయూ) దుబారా ఖర్చులపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆటగాళ్ల కోసం అరటిపండ్లపై ఏకంగా రూ.35 లక్షలు ఖర్చు చేశారంటూ ఆడిట్ నివేదికలో పేర్కొనడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన రూ.12 కోట్ల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన హైకోర్టు మంగళవారం బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.