US Tariffs: వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన!
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:34 AM
భారత్‌పై అమెరికా సుంకాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం విరమణపై అస్పష్టత నేపథ్యంలో.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొంది.
భారత్-అమెరికా చర్చల
నిలిపివేత దిశగా పరిణామాలు
ఈ నెల 25న భారత్‌కు రావాల్సిన
అమెరికా బృందం పర్యటన రద్దు!
న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారత్‌పై అమెరికా సుంకాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం విరమణపై అస్పష్టత నేపథ్యంలో.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొంది. భారత్‌పై తొలుత 25శాతం వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్.. తాము వద్దని చెప్పినా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ మరో 25శాతం సుంకాలు విధించారు. ఈ అంశం తేలేవరకు వాణిజ్య చర్చలు ఉండబోవని కూడా ప్రకటించారు.
తొలి 25 శాతం సుంకంఇప్పటికే అమల్లోకి రాగా.. అదనపు 25శాతం సుంకం ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు వాణిజ్య ఒప్పందంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ నెల 25 నుంచి 29 వరకు జరగాల్సిన ఆరో దశ చర్చల కోసం అమెరికా బృందం రానుందని భారత అధికార వర్గాలు తొలుత పేర్కొన్నాయి. కానీ అమెరికా బృందం పర్యటన రద్దయిందని తాజాగా కేంద్ర వాణిజ్యశాఖ వర్గాలు తెలిపాయి.