Share News

US Citizenship: నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:36 AM

వలసదారుల పౌరసత్వ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనే సమయంలో ‘నైతిక ప్రవర్తన’పై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను అమెరికా పౌరతస్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) ఆదేశించింది.

US Citizenship: నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం

  • వలసదారుల దరఖాస్తులపై యూఎ్‌ససీఐఎస్‌ ఆదేశం

  • ఎటువంటి నేరచరిత్ర లేకపోవడమే మంచి ప్రవర్తనగా నిర్వచనం

న్యూఢిల్లీ, ఆగస్టు 17: వలసదారుల పౌరసత్వ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనే సమయంలో ‘నైతిక ప్రవర్తన’పై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను అమెరికా పౌరతస్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) ఆదేశించింది. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకొనేవారికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం మంచి నైతిక ప్రవర్తనగా అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టం పేర్కొంటోంది. ఇప్పుడు దీని పరిధిని మరింత విస్తరించనున్నారు.


కుటుంబ బంధాలకు, సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, సమాజంతో మమేకమవడం, ఉన్నత విద్యార్హతలు, స్థిరమైన, చట్టబద్ధమైన ఉద్యోగం, పన్ను చెల్లించే స్థితి వంటి అంశాలతో పాటు దరఖాస్తుదారులు అమెరికాలో నివసించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు.

Updated Date - Aug 18 , 2025 | 08:05 AM