Civil Services Mains Results Announced: సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:03 AM
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ 2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు...
ఇంటర్వ్యూకు 2,736 మందికి అర్హత
వారిలో తెలంగాణ నుంచి 43 మంది
న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ (మెయిన్)-2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో మొత్తంగా 2,736 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మెయి న్, ఇంటర్వ్యూకి కలిపి మొత్తం వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ మార్కుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఏఎ్‌ఫఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎ్‌స)తో పాటు ఇతర కేంద్ర సరీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే, తెలంగాణలో సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సివిల్స్‌కు ఎంపికైన 2,736 మందిలో ప్రభుత్వం చేయూతనిచ్చిన 43 మంది ఉన్నారు.