Daily Newspaper Reading Mandatory for Students: యూపీలోని బడుల్లో ప్రతిరోజూ పత్రికా పఠనం
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:49 AM
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు సామాజిక స్పృహను పెంపొందించేందుకు యూపీ విద్యాశాఖ కీలకనిర్ణయం తీసుకుంది...
లక్నో, డిసెంబర్ 26: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు సామాజిక స్పృహను పెంపొందించేందుకు యూపీ విద్యాశాఖ కీలకనిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల అసెంబ్లీలో వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అదనపు కార్యదర్శి పార్థసారథి సేన్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం ప్రార్థనా సమయంలో కనీసం 10నిమిషాలు వార్తాపత్రిక పఠనం కోసం కేటాయించాలి. జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలతో పాటు ప్రధాన సంపాదకీయాలను వంతుల వారీగా చదివి వినిపించాలి. పిల్లల్లో సృజనాత్మకతను పెంచేందుకు.. విద్యార్థులే స్కూల్ మ్యాగజైన్లు ప్రచురించేలా ప్రొత్సహించడంతో పాటు పత్రికల్లో వచ్చిన అంశాలపై ఎడిటోరియల్ రచనలు, బృందచర్చలు నిర్వహించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.