Share News

Education Policy: విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు ఇక ఇండియాలో

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:59 AM

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా తదితర దేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థులు ఇక విదేశాలకు వెళ్లనక్కర్లేదు. త్వరలో ప్రసిద్ధ విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంప్‌సలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.

Education Policy: విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు ఇక ఇండియాలో

  • 5 విద్యా సంస్థలకు యూజీసీ లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ జారీ

న్యూఢిల్లీ, జూన్‌ 15: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా తదితర దేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థులు ఇక విదేశాలకు వెళ్లనక్కర్లేదు. త్వరలో ప్రసిద్ధ విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంప్‌సలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ విద్యావిధానం-2020’ అంతర్జాతీయకరణలో భాగంగా దేశంలో విదేశీ యూనివర్సిటీల ప్రవేశానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఈ మేరకు సదరు విదేశీ యూనివర్సిటీలకు యూజీసీ ఆదివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అధికారికంగా లెటర్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ (ఎల్వోఐ) అందజేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌, యూజీసీ తాత్కాలిక చైర్మన్‌ వినీత్‌ జోషి పాల్గొన్నారు. ఎల్వోఐ అందుకున్న సంస్థల్లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ అనుబంధ యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (బ్రిటన్‌)లోని యూనివర్సిటీ ఆఫ్‌ అబేర్డీన్‌, ఇల్లినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - ఐఐటీ (అమెరికా), యూరోపియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ -ఎల్‌ఈడీ (ఇటలీ) ఉన్నాయి. సదరు సంస్థలు క్యాంప్‌సలు ఏర్పాటు చేసుకుని అడ్మిషన్లు ప్రారంభించడానికి 18 నెలల సమయం పడుతుంది.

Updated Date - Jun 16 , 2025 | 06:00 AM