Undiagnosed Diabete: పేద దేశాలకు సవాల్‌గా మధుమేహం
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:22 AM
ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. మధుమేహంతో బాధపడుతున్న చాలామందిలో..
పరీక్షించుకోని 44 శాతం మంది
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. మధుమేహంతో బాధపడుతున్న చాలామందిలో అసలు తమకు ఈ సమస్య ఉన్నట్టే తెలియడం లేదు. 2023లో ప్రపంచంలోని మధుమేహ రోగుల్లో దాదాపు 44 శాతం మంది పరీక్షలకు దూరంగా ఉంటున్నారని తాజా అధ్యయనంలో గుర్తించారు. పేద, మధ్య ఆదాయ దేశాలకు ఈ పరిస్థితి ఒక సవాల్‌గా మారిందని ఈ అధ్యయనం పేర్కొంది. లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 2023లో భారత్‌లోని మధుమేహ జనాభాలో 43.6 శాతం మందికి వ్యాధి ఉన్నట్టు తెలీదు. అయితే వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 97 శాతం మంది చికిత్స పొందుతున్నారని ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ (జీబీడీ) పేరిట అధ్యయనం చేపట్టిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య 130 కోట్లకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.