UIDAI Rules: హోటళ్లు, ఈవెంట్స్ ఆర్గనైజర్లు ఆధార్ కాపీలను తీసుకోవద్దు!
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:39 AM
హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్స్ వంటి సంస్థలు కస్టమర్ల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను తీసుకుని నిల్వ చేయకుండా నిరోధించే లక్ష్యంతో ....
త్వరలో యూఐడీఏఐ కొత్త నిబంధన
న్యూఢిల్లీ, డిసెంబరు 7: హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్స్ వంటి సంస్థలు కస్టమర్ల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను తీసుకుని నిల్వ చేయకుండా నిరోధించే లక్ష్యంతో త్వరలోనే యూఐడీఏఐ కొత్త నిబంధనను తీసుకురానుంది. జిరాక్స్ కాపీలు తీసుకుని నిల్వ చేయడం ఆధార్ చట్టానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనను తీసుకురాబోతోంది. ఈమేరకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణను కోరే హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్ల రిజిస్ర్టేషన్‌ను తప్పనిసరి చేసే నిబంధనకు అథారిటీ ఆమోదం తెలిపిందని యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ తెలిపారు. క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయడం లేదా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వ్యక్తుల వెరిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుందని చెప్పారు. నూతన ధ్రువీకరణ విధానం వినియోగదారుల గోప్యత రక్షణను పెంచుతుందని కుమార్ తెలిపారు.