Share News

ఐఐటీ, ఐఐఎంలు సహా 89 సంస్థలకు యూజీసీ షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:07 AM

యాంటీ ర్యాగింగ్‌ నిబంధనలు-2009 పాటించని ఒక ఐఐటీ, రెండు ఐఐఎంలు, పలు సెంట్రల్‌, స్టేట్‌ యూనివర్సిటీలు సహా 89 సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఐఐటీ, ఐఐఎంలు సహా 89 సంస్థలకు యూజీసీ షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ, జూన్‌ 12: యాంటీ ర్యాగింగ్‌ నిబంధనలు-2009 పాటించని ఒక ఐఐటీ, రెండు ఐఐఎంలు, పలు సెంట్రల్‌, స్టేట్‌ యూనివర్సిటీలు సహా 89 సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో తాము చేసిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే నిధులు నిలిపివేస్తామని కూడా యూజీసీ హెచ్చరించింది. నిబంధనలు పాటించని సంస్థల జాబితాలో వాటిని చేర్చి యూజీసీ వెబ్‌సైట్‌లో ఆ జాబితాను ఉంచుతామని, వాటి గుర్తింపు, అనుబంధం రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టంచేసింది.


30 రోజుల్లోగా విద్యార్థులందరి నుంచి ఆన్‌లైన్‌లో సమ్మతి పత్రాలు స్వీకరించాలని, ర్యాగింగ్‌ నివారణకు తీసుకున్న చర్యలను తెలియజేస్తూ సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో ఏపీకి చెందిన ది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, ఐఐటీ-పలక్కడ్‌, ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-రో్‌హతక్‌, నలందా యూనివర్సిటీ(రాజ్‌గిర్‌), ఇగ్నో(ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ), ఏఎంయూ(అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ) తదితరాలు ఉన్నాయి.

Updated Date - Jun 13 , 2025 | 05:07 AM