Statistics: దేశంలో మూడింట రెండు వంతులు పనిచేసే వయసువారే
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:16 AM
దేశ జనాభాలో పని చేసే వయసు ప్రజలు మూడింట రెండు వంతులు ఉన్నారు. మొత్తం జనాభాలో 66 శాతం మంది పని చేసే వయసు..
తొలి మూడు రాష్ట్రాల్లో ఢిల్లీ, తెలంగాణ, ఏపీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: దేశ జనాభాలో పని చేసే వయసు ప్రజలు మూడింట రెండు వంతులు ఉన్నారు. మొత్తం జనాభాలో 66 శాతం మంది పని చేసే వయసు (15-59) విభాగంలో ఉన్నారని నమూనా నమోదు సిస్టం గణాంక నివేదిక 2023 వెల్లడించింది. ఈ విభాగంలో ఢిల్లీలో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. తర్వాత స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఇక బాలల విభాగంలో జనాభా భారీగా తగ్గిపోయింది. మొత్తం జనాభాలో 0-14 ఏళ్ల విభాగంలో 24.2 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పని చేసే విభాగంలో ప్రజల సంఖ్య మాత్రం పెరిగింది. నివేదిక ప్రకారం.. ఢిల్లీలో 70.8ు వర్కింగ్ ఏజ్‌లో ఉన్నారు. తెలంగాణలో 70.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 70.1 శాతం ప్రజలున్నారు. మొత్తం జనాభాలో పట్టణ వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా 68 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 64 శాతం ప్రజలు నివసిస్తున్నారు.