Share News

Myanmar job scam: మయన్మార్‌లో ఉద్యోగాల ఎర.. ఇద్దరికి బేడీలు

ABN , Publish Date - May 25 , 2025 | 05:11 AM

మయన్మార్‌ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి సైబర్‌ నేరాలకు వినియోగించిన కేసులో ఇద్దరిని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు జేమ్స్‌ను కోల్‌కతాలో, రిక్రూటింగ్‌ ఏజెంట్‌ హితేశ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు.

Myanmar job scam: మయన్మార్‌లో ఉద్యోగాల ఎర.. ఇద్దరికి బేడీలు

యన్మార్‌లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగించి, సైబర్‌ నేరా లు చేయిస్తున్న కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగోయల్‌ తెలిపారు. జీడిమెట్లకు చెందిన నాగశివ అలియాస్‌ జేమ్స్‌పై మూడు కేసులు నమోదయ్యాయని.. ఇతనిపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసు జారీ అయ్యిందని తెలిపారు. ఇతను లావోస్‌ నుంచి రావడంతో.. కోల్‌కతా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇదే కేసులో రిక్రూటింగ్‌ ఏజెంట్‌గా పనిచేసిన గుజరాత్‌ నివాసి హితేశ్‌ను మయన్మార్‌ పోలీసులు తిప్పిపంపగా.. ఢిల్లీలో అరెస్టయినట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 05:11 AM